నేడు ఐపీఎల్ లో మరో ఆసక్తికరమైన పోరు జరగనుంది. ఈ సీజన్ లో భీకర ఫామ్ లో ఉన్న హైదరబాద్ సన్ రైజర్స్ తో ఢిల్లీ క్యాపిటల్స్ తలపడనుంది. డిల్లిలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరగనున్న ఈ మ్యాచ్ రాత్రి 7:30 ప్రారంభం కానుంది. ఇప్పటివరకు 6 మ్యాచ్ లు ఆడిన ఎస్‌ఆర్‌హెచ్ నాలుగింట్లో విజయం సాధించి పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో ఉంది. అటు ఢిల్లీ క్యాపిటల్స్ ఏడు మ్యాచ్ లు ఆడి మూడింట్లో విజయం సాధించి ఆరో స్థానంలో ఉంది. ఈ మ్యాచ్ లో గెలిచి పాయింట్ల పట్టికలో స్థానాన్ని మెరుగు పరచుకోవాలని ఇరు జట్లు భావిస్తున్నాయి. బ్యాటింగ్ ప్రధాన బలంగా ఎస్‌ఆర్‌హెచ్ బరిలోకి దిగుతోంది. ఆ జట్టులోని ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, క్లాసేన్, మర్క్రమ్, షదబ్.. వంటి బ్యాట్స్ మెన్స్ భీకర ఫామ్ లో ఉన్నారు.
మొదట బ్యాటింగ్ చేస్తే భారీ స్కోర్ చేసే దిశగా బ్యాట్స్ మెన్స్ వీర విహారం చేస్తున్నారు. అటు బౌలర్స్ లో కమిన్స్, భువనేశ్వర్, వంటి వారు కూడా పరవలేదనిపిస్తున్నారు. దాంతో డిల్లీతో జరిగే ఈ మ్యాచ్ లో ఎస్‌ఆర్‌హెచ్ చెలరేగడం ఖాయంగా కనిపిస్తోంది. ఇక ఢిల్లీ క్యాపిటల్స్ విషయానికొస్తే మొదట వరుస ఓటములతో డీలా పడినప్పటికీ ఆ తర్వాత సమిష్టి కృషితో వరుస విజయాలను ఖాతాలో వేసుకుంటుంది. బ్యాట్స్ మెన్స్ లో రిషబ్ పంత్, స్టబ్స్, షాయ్ హోప్ వంటి వారు రాణిస్తున్నారు. బౌలర్స్ లో ఇషాంత్ శర్మ, విలిమ్స్, కుల్దీప్, అక్షర్ పటేల్ పరవలేదనిపిస్తున్నారు. దాంతో మరోసారి సమిష్టిగా రాణించి ఎస్‌ఆర్‌హెచ్ పై విజయం సాధించాలని పట్టుదలగా ఉంది డిల్లీ క్యాపిటల్స్.
ఎస్‌ఆర్‌హెచ్ ‘టార్గెట్ 300’
ఈ సీజన్ లో ఎస్‌ఆర్‌హెచ్ హడావిడి మామూలుగా లేదు. ముఖ్యంగా బ్యాటింగ్స్ లో ప్రత్యర్థి జట్లకు వణుకు పుట్టిస్తోంది. ఇప్పటికే రెండు సార్లు హయ్యెస్ట్ స్కోర్ సాధిచిన జట్టుగా రికార్డ్ సృష్టించిన సన్ రైజర్స్. మరో రికార్డ్ పై కన్నెసింది. ఒకే సీజన్ లో 277, 288 పరుగులు చేసి ఐపీఎల్ లో హయ్యెస్ట్ స్కోర్ సాధించిన జట్టుగా ఎస్‌ఆర్‌హెచ్ ఉన్న సంగతి తెలిసిందే. అయితే తమ టార్గెట్ 300 పరుగులు చేయడమని ఇటీవల ఆ జట్టు ఓపెనర్ ట్రావిస్ హెడ్ చెప్పిన సంగతి తెలిసిందే. మరి నేడు జరిగే మ్యాచ్ లో ఎస్‌ఆర్‌హెచ్ టార్గెట్ రిచ్ అవుతుందో లేదో చూడాలి.
Also Read:Sharwanand:’మనమే’ టీజర్