సన్ రైజర్స్ తో చెన్నై ‘డూ ఆర్ డై’ !

47
- Advertisement -

నేడు ఐపీఎల్ లో అభిమానులకు డబుల్ బొనాంజా ఉండనుంది. మొదటగా మధ్యాహ్నం 3:30 గంటలకు గుజరాత్ టైటాన్స్ తో ఆర్సీబీ తలపడనుంది. ఇప్పటికే ప్లే ఆఫ్ అవకాశాలను సంక్లిష్టం చేసుకున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఎలాంటి ఒత్తిడి లేకుండా మ్యాచ్ అడుతుండగా.. మరోవైపు గుజరాత్ కు చావో రేవో అన్నట్లుగా మారింది. ప్లే ఆఫ్ రేస్ లో నిలవాలంటే తప్పనిసరిగా గెలవాల్సిన పరిస్థితి. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో ఉన్న గుజరాత్ ఈ మ్యాచ్ లో గెలిస్తే ప్లే ఆఫ్ అవకాశాలను సజీవంగా నిలుపుకోవడంతో పాటు పాయింట్ల పట్టికలో స్థానాన్ని కూడా మెరుగుపరుచుకుంటుంది.

ఇక రాత్రి జరగనున్న మ్యాచ్ లో సన్ రైజర్స్ తో చెన్నై ఢీ కొట్టబోతుండడంతో ఈ మ్యాచ్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే గతంలో ఈ రెండు జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో సన్ రైజర్స్ పై చేయి సాధించింది. దాంతో ఈసారి ప్రతీకారం తీర్చుకునేందుకు చెన్నై ఆరాటపడుతోంది. పైగా ప్లే ఆఫ్ కు చేరుకోవాలంటే ఎస్‌ఆర్‌హెచ్ పై చెన్నై తప్పనిసరిగా గెలవాల్సి ఉంటుంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఎస్‌ఆర్‌హెచ్ మూడో స్థానంలో ఉండగా చెన్నై ఆరో స్థానంలో కొనసాగుతోంది. ఈ మ్యాచ్ లో చెన్నై ఓడిపోతే మరింత పాయింట్ల పట్టికలో మరింత కిందకి పడిపోయే అవకాశం ఉంది. ఒకవేళ ఎస్‌ఆర్‌హెచ్ గెలిస్తే ప్లే ఆఫ్ కు మరింత దగ్గరవుతుంది. మరి ఏ జట్టు విజయం సాధిస్తుందో చూడాలి.

ఎస్‌ఆర్‌హెచ్ ను నిలువరించేనా ?

ఈ సీజన్ లో భీకర ఫామ్ లో ఉన్న సన్ రైజర్స్ హైదరబాద్ ఎనిమిది మ్యాచ్ లకు గాను అయిదింట్లో విజయం సాధించి 10 పాయింట్లతో మూడో స్థానంలో ఉంది. వరుస విజయాలతో జోరు మీద ఉన్న ఎస్‌ఆర్‌హెచ్ కు గత మ్యాచ్ లో ఆర్సీబీ బ్రేకులు వేసింది. దాంతో నేడు చెన్నై తో జరిగే మ్యాచ్ లో గెలిచి తిరిగి మళ్ళీ ఫామ్ లోకి రావాలని చూస్తోంది. ఓపెనర్స్ ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ ఏ మాత్రం చెలరేగిన మ్యాచ్ వన్ సైడ్ అయ్యే అవకాశం లేకపోలేదు. ఇక మిడిలార్డర్ లో క్లాసేన్, నితిశ్, షాదబ్.. వంటి బ్యాట్స్ మెన్స్ తో ఎస్‌ఆర్‌హెచ్ పటిష్టంగా ఉంది. మరి ఆరెంజ్ ఆర్మీని చెన్నై సూపర్ కింగ్స్ ఎంతవరకు కట్టడి చేస్తుందో చూడాలి.

Also Read:KCR:అక్కరకు రాని చుట్టం బీజేపీ?

- Advertisement -