ఐపీఎల్ 2025కి రంగం సిద్ధమైంది. ఈ మెగా టోర్నీ ప్రారంభానికి ముందు నిర్వహించే వేలం పాటు ఇటీవల అబుదాబి వేదికగా జరుగగా భారత క్రికెటర్లపై కాసుల వర్షం కురిపించాయి ఫ్రాంఛైజీలు. ఇక వేలంలో మొత్తం 84 మంది ఆటగాళ్లను వేలం వేయగా, అందులో 12 మంది మాత్రమే మిగిలారు. వీరిని ఏ జట్టు కొనుగోలు చేయలేదు.
ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన క్రికెటర్‌గా రిషబ్ పంత్ నిలిచాడు. లక్నో రూ. 27 కోట్లు వెచ్చించి పంత్‌కు దక్కించుకోగా ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధర పలికిన ఆటగాడిగా నిలిచాడు పంత్. ఆ తర్వాత స్థానంలో శ్రేయాస్ అయ్యర్ నిలిచాడు. శ్రేయాస్‌ను రూ. 26.75 కోట్లకు పంజాబ్ కింగ్స్ దక్కించుకుంది. ప్రపంచంలోని అత్యుత్తమ ఫ్రాంచైజీ లీగ్‌లో ఆడేందుకు 1574 మంది క్రికెటర్లు నమోదు చేసుకున్నారు. తుది జాబితాలో 574 మందికి చోటు దక్కింది. ఈ సారి వేలంలో ఆసీస్ స్టార్ బ్యాట్స్‌మెన్ డేవిడ్ వార్నర్ అమ్ముడుపోకపోవడం విశేషం.
ఇక ఇప్పటివరకు ఐపీఎల్‌లో అత్యధిక ధర పలికిన ఆటగాళ్ల వివరాలను పరిశీలిస్తే… రిషబ్ పంత్ రూ.27 కోట్లు (లక్నో సూపర్ జెయింట్స్ – 2025),శ్రేయాస్ అయ్యర్ రూ. 26.75 కోట్లు (పంజాబ్ కింగ్స్ – 2025),మిచెల్ స్టార్క్ రూ. 24.75 కోట్లు (కోల్‌కతా నైట్‌రైడర్స్ – 2024),వెంకటేష్ అయ్యర్ రూ.23.75 కోట్లు (కోల్‌కతా నైట్‌రైడర్స్ -2025), పాట్ కమిన్స్ రూ.20.50 కోట్లు (సన్‌రైజర్స్ హైదరాబాద్ -2024) ఉన్నారు.
సామ్ కరన్ రూ.18.5 కోట్లు (పంజాబ్ కింగ్స్ -2023),అర్షదీప్ సింగ్ రూ.18 కోట్లు (పంజాబ్ కింగ్స్ -2025), యుజ్వేంద్ర చాహల్ రూ. 18 కోట్లు (పంజాబ్ కింగ్స్ – 2025), కామెరూన్ గ్రీన్ రూ.17.50 కోట్లు (ముంబయి ఇండియన్స్ – 2023), బెన్ స్టోక్స్ రూ.16.25 కోట్లు (చెన్నై సూపర్ కింగ్స్ – 2023) ధర పలికారు. ఈ సారి వేలంలో చెప్పుకోవాల్సింది రిషబ్ పంత్, శ్రేయాస్ అయ్యర్, వెంకటేష్ అయ్యర్ గురించే.ఎందుకంటే ఢిల్లీకి రిషబ్ కెప్టెన్‌గా ఉండగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు శ్రేయాస్ అయ్యర్ కెప్టెన్‌గా ఉన్నారు. కేకేఆర్‌ను 2024లో ఛాంపియన్‌గా నిలిపాడు శ్రేయాస్. కానీ ఇద్దరిని వదులుకున్నాయి ఫ్రాంఛైజీలు.
Also Read;PV Sindhu:పీవీ సింధు పెళ్లి తేదీ ఫిక్స్!