ఐపీఎల్ 17వ సీజన్ లో ఆర్సీబీ వరుస అపజయలతో సతమతమౌతోంది. ఇప్పటివరకు నాలుగు మ్యాచ్ లు ఆడిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఒక్క మ్యాచ్ లో విజయం సాధించి మిగిలిన మూడు మ్యాచ్ లలో ఘోర ఓటమి చవిచూసింది. నిన్న లక్నోతో జరిగిన మ్యాచ్ లో కూడా ఓటమి చవిచూసింది. మొదట బ్యాటింగ్ చేసిన లక్నో నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. డికాక్ (81) పరుగుల అద్బుత ఇన్నింగ్స్ తో జట్టుకు భారీ స్కోర్ అందించాడు. ఆ తరువాత పూరన్ (40), స్టోయినిస్ (24) కేఎల్ రాహుల్ (20) పరుగులతో రాణించారు. ఆ తర్వాత లక్ష్య ఛేదనలో ఆర్సీబీ 153 పరుగులకే కుప్పకూలింది. పాటిదర్ (29), మహిపాల్ (33) మినహా మిగిలిన బ్యాట్స్ మెన్స్ ఎవరు రాణించలేకపోయారు. లక్నో బౌలర్లలో మయంక్ యాదవ్ 4 ఓవర్లలో మూడు వికెట్లు తీసి ఆర్సీబీ పతనాన్ని శాసించాడు. దీంతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ఓటమి తప్పలేదు.
మయాంక్ దెబ్బ
నిప్పులు చెరిగే బౌలింగ్ తో లక్నో పేస్ గన్ మయంక్ యాదవ్ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. 150 కిలోమీటర్ల వేగంతో టాప్ క్లాస్ బ్యాట్స్ మెన్స్ ను సైతం వణికిస్తున్నాడు. ఆర్సీబీ తో జరిగిన మ్యాచ్ లో 4 ఓవర్స్ వేసిన మయంక్ కేవలం 14 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు తీశాడంటే అతడి వేగం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ముందు రోజుల్లో టీమిండియా తరుపున ఆరంగేట్రం చేసిన ఆశ్చర్యం లేదని క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు.
ఇక నేడు నేడు ఐపీఎల్ లో కోల్ కతా నైట్ రైడర్స్ మరియు డిల్లీ క్యాపిటల్స్ తలపడనున్నాయి. వరుస విజయాలతో దూకుడు మీద ఉన్న కోల్ కతా మరో విజయం కోసం ఆరాటపడుతోంది. అటు చెన్నై తో జరిగిన గత మ్యాచ్ లో విజయం సాధించిన డిల్లీ మరో విజయం కోసం ప్రయత్నిస్తోంది. దీంతో ఈ రెండు జట్ల మద్య పోరు ఆసక్తికరంగా మారే అవకాశం ఉంది.
Also Read:TTD:శాస్త్రోక్తంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం