IPL 2024 :పాయింట్స్ టేబుల్..వివరాలివే!

48
- Advertisement -

ఈ నెల 22 న గ్రాండ్ గా ప్రారంభం అయిన ఐపీఎల్ 17 సీజన్ లో అన్నీ జట్లు తొలి మ్యాచ్ ను పూర్తి చేసుకున్నాయి. నెట్ రన్ రేట్ ప్రకారం రాజస్థాన్ రాయల్స్ జట్టు టాప్ ప్లేస్ లో కొనసాగుతోంది. ఆ తరువాత రెండో స్థానంలో చెన్నై సూపర్ కింగ్స్ ఉంది. ఈ రెండు జట్లతో పాటు పంజాబ్, కోల్ కతా, గుజరాత్ జట్లు టాప్ 5 లో కొనసాగుతున్నాయి. చివరి రెండు స్థానాల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, లక్నో సూపర్ జెయింట్స్ జట్లు ఉన్నాయి. ఇక నిన్నటి మ్యాచ్ ల విషయానికొస్తే సండే డబుల్ ధమాకాలో నాలుగు జట్లు హోరహోరీగా తలపడ్డాయి. మొదట లక్నో మరియు రాజస్తాన్ జట్ల మద్య జరిగిన మ్యాచ్ లో రాజస్తాన్ విజయం సాధించింది.

కెప్టెన్ సంజూ సంసాన్ (82) చెలరేగడంతో నాలుగు వికెట్లు కోల్పోయి 193 పరుగులు చేసింది ఆర్ ఆర్. ఆ తరువాత లక్ష్య ఛేదనకు దిగిన లక్నో ఆరు వికెట్లు నష్టపోయి 173 పరుగులకే చేతులెత్తేసింది. దాంతో రాజస్థాన్ రాయల్స్ తొలి విజయాన్ని నమోదు చేసింది. ఇక రాత్రి 8 గంటలకు ప్రారంభమయిన మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ పై గుజరాత్ టైటైన్స్ విజయం సాధించింది.

మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ నిర్ణీత ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 168 పరుగులు చేసింది. సాయి సుదర్శన్ (45), గిల్ (31) మినహా మిగిలిన బ్యాట్స్ మెన్స్ ఎవరు రాణించలేదు. ఇక ఆ తరువాత బ్యాటింగ్ కు దిగిన ముంబై నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లు నష్టపోయి 162 పరుగుల వద్దే నిలిచిపోయింది. రోహిత్ శర్మ (43), బ్రెవిస్ (46) రాణించినప్పటికి మిగిలిన బ్యాట్స్ మెన్స్ చేతులెత్తేయడంతో ముంబైకి ఓటమి తప్పలేదు. 2013 నుంచి ముంబై ఇండియన్స్ తొలి మ్యాచ్ ఓడిపోయే సెంటిమెంట్ ను కొనసాగిస్తూనే ఉంది. ఈ సీజన్ లో కూడా ఓటమితోనే ఆరంభించింది ముంబై ఇండియన్స్.

ఇక నేటి మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ మరియు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడనున్నాయి. మ్యాచ్ రాత్రి 8 గంటలకు ప్రారంభం కానుంది.

Also Read:Suriya:’కంగువ’ అదృష్టంగా భావిస్తున్నా

- Advertisement -