ఐపీఎల్ 2024 ఆసక్తికరంగా సాగుతోంది. ఇంకా పది మ్యాచ్‌లు కూడా లేవు కానీ ప్లే ఆఫ్ బెర్త్ ఎవరెవరికి అనేది ఇంకా కన్ఫామ్ కాలేదు. ఒక్క కేకేఆర్ తప్ప మిగిలిన మూడు స్థానాల్లో ఏఏ జట్లు ఉంటాయోనన్న ఆసక్తి అందరిలో నెలకొంది. 3 స్థానాల కోసం పోటీలో 6 జట్లు ఉన్నాయి.
రాజస్థాన్ రాయల్స్ 12 మ్యాచ్‌ల్లో 8 విజయాలతో పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉంది. మిగిలిన రెండు మ్యాచ్‌ల్లో ఒక విజయాన్ని నమోదుచేసినా రాజస్థాన్ ప్లే ఆఫ్స్ రేసుకి చేరుకునే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఇవాళ జరిగే ఢిల్లీ-లక్నో మధ్య జరిగే మ్యాచ్‌లో ఢిల్లీ గెలిస్తే రాజస్థాన్ బెర్తును ఖాయం చేసుకున్నట్టే.
చెన్నై 13 మ్యాచ్‌ల్లో ఏడు విజయాలతో 14 పాయింట్లు సాధించి మూడో స్థానంలో ఉండగా ఇంకా ఒకే ఒక మ్యాచ్ మిగిలిఉంది. బెంగళూరుతో జరిగే ఈ మ్యాచ్‌లో సీఎస్‌కే ఖచ్చితంగా గెలిచి తీరాల్సిందే. లేదంఏ హైదరాబాద్, లక్నో జట్లు తమ తదుపరి మ్యాచ్‌లలో ఓడితే ప్లేఆఫ్స్ చేరే అవకాశముంటుంది.
సన్‌రైజర్స్ 7 విజయాలతో 14 పాయింట్లతో ఉండగా మరో రెండు మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. ఈ రెండింటిలో హైదరాబాద్ గెలిస్తే ప్లే ఆఫ్స్‌కే కాదు పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరుకునే అవకాశం ఉంది. ఇక ఆర్సీబీ వరుసగా ఐదు విజయాలతో 12 పాయింట్లతో ఉండగా 18న సొంతగడ్డపై చెన్నైతో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ మొదట బ్యాటింగ్ చేస్తే చెన్నైని 18 పరుగుల తేడాతో ఓడించాలి. ఒకవేళ ఛేదనకు దిగాల్సి వస్తే లక్ష్యాన్ని 18.1 ఓవర్లలో పూర్తి చేయాల్సి ఉంటుంది. అప్పుడు మెరుగైన రన్‌రేట్‌తో ఆర్సీబీ సైతం ప్లేఆఫ్స్ రేసులోకి వస్తుంది.
ఢిల్లీ…లక్నోతో మ్యాచ్‌లో గెలిచి లక్నో, హైదరాబాద్ తమ మిగిలిగిన మ్యాచ్‌లలో ఓడితే అప్పుడు ఢిల్లీకి అవకాశముంటుంది. లక్నో సూపర్ జెయింట్స్..పాయింట్ల పట్టికలో ఏడో స్థానం ఉండగా మరో రెండు మ్యాచ్‌లలో గెలిస్తే 16 పాయింట్లకు చేరుతుంది. అది కూడా భారీ తేడాతో గెలిచి రన్ రేట్ మెరుగుపర్చుకోవాలి అప్పుడే ప్లే ఆఫ్స్‌కి ఛాన్స్ ఉంటుంది.
Also Read:కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో కన్నప్ప సందడి..