IPL 2024 :ముంబైతో బెంగళూరు ‘ఢీ’!

34
- Advertisement -

నేడు ఐపీఎల్ లో మరో ఇంట్రెస్టింగ్ ఫైట్ జరగనుంది. ముంబై ఇండియన్స్ మరియు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు వఖండే స్టేడియంలో తలపడనున్నాయి. మ్యాచ్ రాత్రి 7:30 ప్రారంభం కానుంది. అత్యంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న ఈ రెండు జట్లు ఈ సీజన్ లో ఘోర వైఫల్యాలను ఎదుర్కొంటున్నాయి. ముంబై ఇండియన్స్ ఇప్పటివరకు నాలుగు మ్యాచ్ లు అడగా అందులో కేవలం ఒక్క విజయం మాత్రమే సాధించింది మూడింట్లో ఓటమి చవిచూసింది. ఇక బెంగళూరు పరిస్థితి మరి ఘోరం ఐదు మ్యాచ్ లు అడగా నాలుగింట్లో ఓటమి చవిచూసి కేవలం ఒక్క విజయం మాత్రమే సాధించింది. .

ఇలా ఈ రెండు జట్లు వరుస ఓటములతో సతమతమౌతున్నాయి. ప్లే ఆఫ్ చేరుకోవాలంటే ఇకపై ప్రతి మ్యాచ్ లోనూ గెలవాల్సిన పరిస్థితి. ఇరు జట్లలో హార్డ్ హిట్టర్స్ బాగానే ఉన్నప్పటికి లక్ కలిసి రావడంలేదు. ముంబై ఇండియన్స్ చివరి మ్యాచ్ లో విజయం సాధించి కొంత ఊపిరి పిల్చుకుంది. రోహిత్ శర్మ, తిలక్, ఇషన్ కిషన్.. రాణిస్తుండడం ముంబైకి కలిసొచ్చే అంశం. ఇక రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టులో కోహ్లీ మినహా మిగిలిన బ్యాట్స్ మెన్స్ ఘోరంగా విఫలం అవుతున్నారు. బౌలింగ్ లోనూ చెప్పుకోదగ్గ స్థాయిలో రాణించడం లేదు. దాంతో నేడు జరిగే మ్యాచ్ లో ముంబైపై ఎలాగైనా విజయం సాధించాలని బెంగళూరు పట్టుదలగా ఉంది. మరి ఏ జట్టు విజయం సాధిస్తుందో చూడాలి.

ఇక నిన్న జరిగిన మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ పై గుజరాత్ టైటాన్స్ థ్రిల్లింగ్ విక్టరీ సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన రాయల్స్ నిర్ణీత ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. సంజూ సాంసన్ (68), రియాన్ పరాగ్ (76), హాఫ్ సెంచరీలతో రాణించారు. ఆ తర్వాత బ్యాటింగ్ చేసిన గుజరాత్ గెలుపు కోసం చివరి వరకు పోరాడి.. చివరి బాల్ తో విజయం సాధించింది. సాయి సుదర్శన్ (35), గిల్ (72), టైటాన్స్ విజయంలో ముఖ్య పాత్ర పోషించారు. ఈ సీజన్ లో గుజరాత్ కు మూడో విజయం కాగా, రాజస్థాన్ రాయల్స్ తొలి ఓటమిని మూటగట్టుకుంది..

Also Read:టీడీపీలో ‘ఉండి’ టికెట్ రచ్చ!

- Advertisement -