ఐపీఎల్ 2024ను ఓటమితోనే ముగించింది ముంబై. హోం గ్రౌండ్స్ వాంఖడేలో లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 18 పరుగుల తేడాతో ఓటమిని మూటగట్టుకుంది ముంబై. లక్నో విధించిన 215 పరుగుల లక్ష్య చేధనలో 196 పరుగులకే పరిమితమైంది ముంబై.
రోహిత్ శర్మ 38 బంతుల్లో 3 సిక్స్‌లు,10 ఫోర్లతో 68 పరుగులు, చివరలో నమన్ ధీర్ 28 బంతుల్లో 5 సిక్స్‌లు,4 ఫోర్లతో 62 నాటౌట్‌గా నిలవగా మిగితా బ్యాట్స్‌మెన్ అంతా దారుణంగా విఫలమయ్యారు. దీంతో ముంబైకి ఓటమి తప్పలేదు. సూర్య డకౌట్ కాగా హార్ధిక్‌తో పాటు టాప్ ఆర్డర్ అంతా విఫలమైంది. దీంతో ముంబైకి ఓటమి తప్పలేదు.
ఇక అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో నిర్ణీత ఓవర్లలో 6 వికెట్లు కొల్పోయి 214 పరుగులు చేసింది. నికోలస్ పూరన్ 29 బంతుల్లో 8 సిక్స్‌లు,5 ఫోర్లతో 75 పరుగులు చేయగా రాహుల్ 41 బంతుల్లో 3 సిక్స్‌లు,3 పోర్లతో 55 పరుగులు చేయడంతో 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 214 పరుగులు చేసింది. ముంబై బౌలర్లలో తుషారా 3/28, చావ్లా 3/29) వికెట్లు తీయగా పూరన్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది.
Also Read:‘కన్నప్ప’లో కాజల్ అగర్వాల్