IPL 2024:ఓపెనర్‌గా ధోని.. పూనకాలే?

50
- Advertisement -

ఈ ఐపీఎల్ సీజన్ లో ఎం‌ఎస్ ధోని క్రికెట్ అభిమానులకు సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాడా ? అంటే అవుననే అంటున్నాయి క్రీడా వర్గాలు. ఇటీవల ధోని తన ఫేస్ బుక్ పేజ్ లో ఆసక్తికరమైన పోస్ట్ చేశాడు. ‘కొత్త పాత్ర.. కొత్త సీజన్ కోసం ఆసక్తికరంగా ఎదురు చూస్తున్న” అంటూ ధోని రాసుకొచ్చాడు. దీంతో ఈ ఐపీఎల్ సీజన్ లో ధోని పోషించే ఆ కొత్త పాత్ర ఎంటనేది బిగ్ సస్పెన్స్ గా ఉంది. కొందరు చెబుతున్న దాని ప్రకారం ఈ సీజన్ లో ధోని కెప్టెన్సీ బాద్యతలకు దూరమై మెంటర్ గా కనిపించబోతున్నాడని చెబుతున్నారు. మరికొందరేమో ఈ సీజన్ లో ధోని ఓపెనర్ గా బరిలోకి దిగుతాడనేది మరికొందరు చెబుతున్న మాట. ఎందుకంటే సి‌ఎస్‌కే ఓపెనర్ కాన్వే గాయం కారణంగా టోర్నీ మొత్తానికి దూరం కానున్నట్లు తెలుస్తోంది. అందుకే కాన్వేకు బదులుగా ధోని ఓపెనర్ గా కనిపించే అవకాశం ఉందనేది, ఈ సీజన్ లో ధోని కొత్త పాత్ర అదేనని చర్చ జరుగుతోంది.

అయితే ఇంతవరకు ధోని కెరియర్ లో ఎప్పుడు కూడా ఓపెనర్ గా బరిలోకి దిగలేదు. నాలుగో బ్యాట్స్ మెన్ గా లేదా లోయర్ ఆర్డర్ లో బరిలోకి ధోని రావడం చూశాం. ఇక అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పిన తర్వాత కూడా ధోని ఐపీఎల్ లో లో కూడా లోయర్ ఆర్డర్ లోనే బరిలోకి దిగుతూ వచ్చారు. ఇకపోతే ఈ సీజన్ ఐపీఎల్ తర్వాత ధోని రిటైర్మెంట్ తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అందుకే చివరి సీజన్ అందరికీ గుర్తుండిపోయేలా ఆడేందుకు ధోని ఓపెనర్ అవతారం ఎత్తనున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఇదే గనుక నిజం అయితే వింటేజ్ ధోనిని అభిమానులు చూసే అవకాశం ఉంది. కెరీర్ మొదట్లో ధనాధన్ బ్యాటింగ్ తో ధోని చేసిన రచ్చ క్రికెట్ అభిమానులు అంతా తేలికగా మర్చిపోలేరు. మరి అలాంటి ధనాధన్ బ్యాటింగ్ ధోని మరోసారి రిపీట్ చేస్తే క్రికెట్ అభిమానులకు పండగే. మరి ధోని కొత్త అవతారం ఏంటో తెలియాలంటే మార్చి 22 వరకు వెయిట్ చేయాల్సిందే.

Also Read:KCR:రోజురోజుకు దిగజారుతున్న కాంగ్రెస్ పాలన

- Advertisement -