IPL 2024 :చెన్నైని భయపెడుతుందా?

47
- Advertisement -

ఐపీఎల్ లో నేడు మరో ఆసక్తికరమైన మ్యాచ్ జరగనుంది. చెన్నై సూపర్ కింగ్స్ మరియు హైదరాబాద్ సన్ రైజర్స్ మధ్య రాత్రి 7:30 గంటలకు మ్యాచ్ జరగనుంది. ఈ సీజన్ లో సన్ రైజర్స్ జట్టు అత్యంత పటిష్టంగా కనిపిస్తూ ప్రత్యర్థి జట్లను బెంబేలెత్తిస్తోంది. ఇప్పటివరకు వరకు మూడు మ్యాచ్ లు ఆడిన ఎస్‌ఆర్‌హెచ్ రెండిట్లో ఓటమి చవి చూడగా ఒక్క విజయం మాత్రమే సాధించింది. అయినప్పటికి ఆడిన ప్రతి మ్యాచ్ లోనూ అద్బుత ప్రదర్శన కనబరుస్తూ అభిమానులను అలరిస్తోంది. ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్ లో ఎస్‌ఆర్‌హెచ్ సృష్టించిన విధ్వంసం అభిమానులు ఎవరు అంతా తేలికగా మర్చిపోలేరు.

ఉప్పల్ లో జరిగిన ఆ మ్యాచ్ లో ఏకంగా 277 పరుగులు చేసి రికార్డు సృష్టించింది సన్ రైజర్స్ జట్టు. చెన్నైతో జరిగే నేటి మ్యాచ్ కూడా ఉప్పల్ లోనే జరుగుతుండడంతో మరోసారి ఎస్‌ఆర్‌హెచ్ విజృంభిస్తుందా అనేది చూడాలి. ఇప్పటివరకు ఇరు జట్ల మధ్య 19 మ్యాచ్ లు జరగగా అందులో చెన్నై 14 విజయాలు సాధించింది. ఆయిదింట్లో ఎస్‌ఆర్‌హెచ్ విజయం సాధించింది. ఇక ఉప్పల్ లో ఇరు జట్లు నాలుగు సార్లు తలపడగా చెరో రెండు విజయాలు దక్కించుకున్నాయి. ఇరు జట్లు కూడా గత మ్యాచ్ లో ఓటమి చవిచూశాయి. ఎస్‌ఆర్‌హెచ్ గుజరాత్ టైటాన్స్ చేతిలో ఓడిపోగా, చెన్నై డిల్లీ చేతిలో ఓడిపోయింది. దాంతో రెండు జట్లు కూడా విజయం కోసం పట్టుదలగా ఉన్నాయి. హోమ్ గ్రౌండ్ లో మ్యాచ్ జరుగుతుండడం ఎస్‌ఆర్‌హెచ్ కు కలిసొచ్చే అంశం. మరి ఈ మ్యాచ్ లో ఈ జట్టు విజయం సాధిస్తుందో చూడాలి.

ధోనీ ఈజ్ బ్యాక్

ఢిల్లీ తో జరిగిన మ్యాచ్ లో ధోని మెరుపులు మెరిపించాడు. మరోసారి తన ఫినిషింగ్ స్టైల్ లో ధనాధన్ బ్యాటింగ్ చేసి వింటేజ్ ధోనిని గుర్తుకు చేశాడు. దాంతో ఎస్‌ఆర్‌హెచ్ తో జరిగే మ్యాచ్ లో ధోని బ్యాటింగ్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

క్లాసేన్ చెలరేగితే..

ఎస్‌ఆర్‌హెచ్ బ్యాటింగ్ లో కీలక సమయాల్లో విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడుతూ ప్రత్యర్థి బౌలర్స్ కు వణుకు పుట్టిస్తున్న క్లాసెన్ చెన్నై తో జరిగే మ్యాచ్ లో ఏ మాత్రం చెలరేగిన ఎస్‌ఆర్‌హెచ్ భారీ స్కోర్ చేయడం ఖాయం. మరి చెన్నై బౌలర్స్ క్లాసేన్ ను ఎలా ఎదుర్కొంటారో చూడాలి.

Also Read:ఫ్యామిలీ స్టార్..ట్విట్టర్ రివ్యూ

- Advertisement -