IPL 2023:ఆర్సీబీకి.. చావో రేవో !

44
- Advertisement -

ప్లే ఆఫ్ రేస్ లో భాగంగా నేటి ఐపీఎల్ మ్యాచ్ లో హైదరబాద్ సన్ రైజర్స్ మరియు బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ జట్లు తలపడనున్నాయి. ప్లే ఆఫ్ రేస్ నుంచి హైదరబాద్ ఇప్పటికే నిష్క్రమించగా.. బెంగళూరుకు ఈ మ్యాచ్ కీలకం కానుంది. ఈ మ్యాచ్ లో ఆర్సీబీ గెలిస్తే ప్లే ఆఫ్ రేస్ లో ఉంటుంది. అది కూడా ఎస్‌ఆర్‌హెచ్ పై భారీ తేడాతో గెలవాల్సి ఉంటుంది. అయినప్పటికి ఇతర జట్లపై గెలుపోటములపై ఆధారపడక తప్పదు. ఐపీఎల్ కెరియర్ మొత్తంలో ఈ రెండు జట్లు ఇప్పటివరకు 22 సార్లు తలపడగా అందులో హైదరబాద్ 12 సార్లు విజయం సాధించగా, బెంగళూరు కేవలం 9 సార్లే విజయం సాధించింది. ఒక మ్యాచ్ ఫలితం తేలలేదు. దీంతో ఎస్‌ఆర్‌హెచ్ జట్టుదే పై చేయిగా ఉన్నప్పటికి ఈ సీజన్ లో అత్యంత ఫెళవమైన ప్రదర్శనతో హైదరబాద్ ఇప్పటికే ప్లే ఆఫ్ రేస్ నుంచి నిష్క్రమించింది..

Also Read:CM KCR:మళ్లీ అధికారం మనదే

బెంగళూరుకి ఈ మ్యాచ్ డూ డై లాంటిది కావడంతో ఆ జట్టు ఎలాంటి ప్రదర్శన చేస్తుందో చూడాలి. హైదరబాద్ జట్టు ఏమాత్రం గెలిచిన ఆర్సీబీకి ప్లే ఆఫ్ అవకాశాలు సంక్లిష్టం అవుతాయి. ఇక నిన్న జరిగిన మ్యాచ్ లో పంజాబ్ జట్టుపై డిల్లీ క్యాపిటల్స్ అదిరిపోయే విజయాన్ని నమోదు చేసింది. ఇప్పటికే ప్లే ఆఫ్ రేస్ నుంచి తప్పుకున్న డిల్లీ..విజయం సాధించి పంజాబ్ ఆశలను కూడా సంక్లిష్టం చేసింది. మొదట బ్యాటింగ్ చేసిన డిల్లీ నిర్ణీత ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 213 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఇక లక్ష్య చేధనలో పంజాబ్ జట్టు నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 198 పరుగులు మాత్రమే చేసింది. దీంతో డిల్లీ ఇంటికి వెళ్తూ వెళ్తూ పంజాబ్ జట్టును కూడా ఇంటిముఖం పట్టించేలా చేసిందనే చెప్పవచ్చు. ఇక అదే విధంగా నేటి ఐపీఎల్ లో ఇప్పటికే ఇంటిముఖం పట్టిన ఎస్‌ఆర్‌హెచ్.. ఆర్సీబీకి ఎలాంటి షాక్ ఇస్తుందో చూడాలి.

Also Read:కేబినెట్ భేటీ..కీలక అంశాలపై చర్చ

- Advertisement -