IPL 2023:నేటి మ్యాచ్ లో గెలిచేదేవరు?

49
- Advertisement -

నేటి ఐపీఎల్ మ్యాచ్ లో సన్ రైజర్స్ మరియు డిల్లీ క్యాపిటల్స్ తలపడనున్నాయి. ఈ రెండు జట్లు ఈ సీజన్ లో అత్యంత ఫెళవమైన ప్రదర్శనతో పాయింట్ల పట్టికలో చివరి రెండు స్థానాల్లో నిలిచాయి. ఇప్పటివరకు ఆరు మ్యాచ్ లు ఆడిన సన్ రైజర్స్ రెండిట్లో మాత్రమే విజయం సాధించింది. ఇక డిల్లీ క్యాపిటల్స్ ఆరు మ్యాచ్ లు అడితే కేవలం ఒక్క విజయాన్ని మాత్రమే నమోదుచేసింది. ప్రస్తుతం ఈ రెండు జట్లు కూడా ప్లే ఆఫ్ కి చాలా దూరంలో ఉన్నాయి. దాంతో ఈ మ్యాచ్ పై పెద్దగా ఎవరికి అంచనాలు లేనప్పటికి ఇరు జట్లు మాత్రం విజయంపై కన్నెశాయి.

ఇప్పటివరకు ఐపీఎల్ లో 21 మ్యాచ్ లు జరుగగా హైదరబాద్ 11 సార్లు గెలిస్తే, డిల్లీ పదిసార్లు విజయాన్ని సొంతం చేసుకుంది. మరి ఈ మ్యాచ్ లో ఏ జట్టు విజయం సాధిస్తుందో చూడాలి. ఇక నిన్న జరిగిన చెన్నై మరియు కోల్ కతా మ్యాచ్ లో చెన్నై 49 పరుగుల తేడాతో భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. మ్యాచ్ ప్రారంభం అయిన మొదటి నుంచే చెన్నై బ్యాటర్స్ విధ్వంసం సృష్టిస్తూ వీరవిహారం చేశారు. అజింక్య రహనే 29 బంతుల్లో 71 పరుగులు, కాన్వే 40 బంతుల్లో 56 పరుగులు, దూబే 21 బంతుల్లో 50 పరుగులు రుతురాజ్ గైక్వార్డ్ ఇలా ప్రతి బ్యాట్స్ మెన్ కూడా కోల్ కతా కు చుక్కలు చూపిస్తూ విధ్వంసం సృష్టించారు.

Also Read:శరీరం చల్లబడాలంటే.. ఇలా చేయండి!

ఏ దశలోనూ కోల్ కతా బౌలర్స్ చెన్నైని కట్టడి చేయలేకపోయారు. ఫలితంగా నాలుగు వికెట్ల నస్థానికీ 235 పరుగుల భారీ లక్ష్యాన్ని కోల్ కతా ముందు ఉంచింది చెన్నై. ఆ తరువాత బ్యాటింగ్ కు దిగిన కోల్ కతా లక్ష్యాన్ని చేదించేందుకు ప్రయత్నించిన వరుస వికెట్లు కోల్పోతుండడంతో చేతులెత్తేసింది. జాన్సన్ రాయ్ 26 బంతుల్లో 61 పరుగులు, రికూ సింగ్ 33 బంతుల్లో 53 పరుగులు చేసి ఆదుకునే ప్రయత్నం చేసిన లక్ష్యం పెద్దది కావడంతో ఫలితం లేకపోయింది. ఈ విజయంతో చెన్నై పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలోకి దూసుకుపోయింది.

Also Read:వామ్మో జగన్ కు ఇన్ని సమస్యలా.. ఇబ్బందే !

- Advertisement -