IPL 2023:చెన్నై జోరు.. రాజస్తాన్ నిలిచేనా!

43
- Advertisement -

నేటి ఐపీఎల్ లో మరో ఆసక్తికరమైన మ్యాచ్ జరగనుంది. వరుస విజయాలతో దూసుకుపోతున్న చెన్నై సూపర్ కింగ్స్ తో రాజస్తాన్ రాయల్స్ జట్టు తలపడనుంది. రాత్రి 7:30 నిముషాలకు ప్రారంభం కానున్న ఈ మ్యాచ్ జైపూర్ లోని సావై ఇండోర్ స్టేడియం లో జరగనుంది. ఈ రెండు జట్ల మద్య జరిగిన మొదటి మ్యాచ్ లో చెన్నై పై రాజస్తాన్ పైచేయి సాధించింది. కాగా ఆ తరువాత నుంచి చెన్నై వరుస విజయాలను నమోదు చేస్తూ టేబుల్ టాపర్ గా నిలిచింది. ప్రస్తుతం 7 మ్యాచ్ లు ఆడిన చెన్నై అందులో ఐదు విజయాలను నమోదు చేసింది. ఇక రాజస్తాన్ రాయల్స్ 7 మ్యాచ్ లు ఆడి నాలుగింట్లో విజయం సాధించింది. ప్రస్తుతం రెండు జట్లు కూడా అత్యంత పటిష్టంగా ఉన్నాయి.

ముఖ్యంగా చెన్నై బ్యాటింగ్ లోనూ బౌలింగ్ లోనూ మెరుపులు మెరిపిస్తోంది. ఋతురాజ్ గైక్వర్డ్, కన్వే, దూబే, రహనే, అద్బుతమైన ఫామ్ లో ఉన్నారు. ముఖ్యంగా రహనే భీకరమైన బ్యాటింగ్ తో అదరగొడుతున్నాడు. ఇక బౌలింగ్ లోనూ పతిరణ, తీక్షణ, సీమర్జిత్ సింగ్ వంటి వాళ్ళు పదునైన పేస్ బౌలింగ్ తో ప్రత్యర్థులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. ఇక రాయల్స్ జట్టుకు చెన్నై కి ఏం తీసినిపోని విధంగా అని విభాగాల్లోనూ అద్బుతంగా రానిస్తోంది. పడిక్కల్, రూట్,సంజు సంసన్ వంటి వాళ్ళు ఫుల్ ఫామ్ లో ఉన్నారు.

Also Read:మన్‌ కీ బాత్‌..ఏప్రిల్‌ 30న 100వ ఎపిసోడ్‌

బౌలింగ్ దళం కూడా పటిష్టంగానే ఉంది. అన్నీ విభాగాల్లోనూ సమిష్టిగా రాణిస్తుండడం రాజస్తాన్ రాయల్స్ కు సానుకూలాంశం. ఇక హోమ్ గ్రౌండ్ లో జరుగుతుండడం రాజస్తాన్ జట్టుకు అదనపు బలం. మరి మ్యాచ్ లో చెన్నై ని మట్టికరిపిచ్చిన రాజస్తాన్.. ఈసారి చెన్నై దూకుడుకు అడ్డుకట్ట వేస్తుందా లేదా అనేది చూడాలి. ఇక నిన్న జరిగిన మ్యాచ్ లో బెంగళూరు పై కోల్ కతా అద్బుత విజయాన్ని సొంతం చేసుకుంది. కోల్ కతా 200 పరుగుల భారీ లక్ష్యాన్ని బెంగళూరు ముందు ఉంచగా.. 179 పరుగులకే కుప్పకూలింది. దాంతో కోల్ కతా 21 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది.

Also Read:ఛాంగురే బంగారురాజా టీజర్‌ లాంచ్‌ బై రవితేజ

- Advertisement -