IPL 2023:చెన్నై, రాజస్తాన్.. జోరు కొనసాగేనా?

38
- Advertisement -

నేటి ఐపీఎల్ లో రెండు ఆసక్తికర మ్యాచ్ లు జరగనున్నాయి. మొదటి మ్యాచ్ లో రాజస్తాన్ రాయల్స్ తో బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ జట్టు తలపడనుంది. ఈ మ్యాచ్ మద్యాహ్నం 3:30 నిముషాలకు ప్రారంభం కానుండగా మరో మ్యాచ్ రాత్రి 7:30 నిముషాలకు ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ మరియు కోల్ కతా నైట్ రైడర్స్ జట్లు తలపడనున్నాయి. వరుస విజయాలతో టేబుల్ టాపర్ గా ఉన్న రాజస్తాన్ రాయల్స్ జట్టు బెంగళూరు పై విజయం సాధించి ఘనంగా ప్లే ఆఫ్ లోకి ఎంట్రీ ఇవ్వాలని చూస్తోంది.

Also Read:మంత్రి కేటీఆర్‌కు మరో అంతర్జాతీయ వేదిక పిలుపు

అయితే గత మ్యాచ్ లక్నో చేతిలో ఓడిపోయిన రాజస్తాన్ ఈ మ్యాచ్ లో కచ్చితంగా గెలవాలని పట్టుదలగా ఉంది. మరోవైపు బెంగళూరు కూడా ఫుల్ ఫామ్ లో ఉంది ఇప్పటివరకు ఆరు మ్యాచ్ లు ఆడిన బెంగళూరు మూడు విజయాలు సాధించి ఆరో స్థానంలో ఉంది. దాంతో రాజస్తాన్ పై పైచేయి సాధించి టాప్ 5 లోకి ఎంట్రీ ఇవ్వాలని పట్టుదలగా ఉంది. ఇక ఇరు జట్లలో కూడా ప్లేయర్స్ అందరూ అద్బుతమైన ఫామ్ లో ఉండడంతో ఈ మ్యాచ్ అభిమానులకు మంచి వినోదాన్ని పంచనుంది. ఇక మరో మ్యాచ్ లో చెన్నై తో కోల్ కతా ఢీ కొట్టబోతుంది. ప్రస్తుతం చెన్నై వరుస విజయాలతో ఫుల్ స్వింగ్ లో ఉంది.

బ్యాటింగ్ బౌలింగ్ రెండు విభాగాల్లోనూ మెరుగైన ప్లేయర్స్ ఉండడం చెన్నై కి కలిసొచ్చే అంశం. ఇంకా ధోని కెపెన్సీ ఆ జట్టుకు అతిపెద్ద ప్లేస్. ప్రస్తుతం టాప్ 3 లో కొనసాగుతున్న చెన్నై ఈ విజయంతో సెమీస్ కు మరింత చేరువ కావాలని చూస్తోంది. మరోవైపు కోల్ కతా గత మూడు మ్యాచ్ లలో వరుసగా ఓడిపోయి ప్లే ఆఫ్ రేస్ లో వెనకబడింది. దాంతో ఈ మ్యాచ్ తో ఎలాగైనా తిరిగి పుంజుకోవలని గట్టి పట్టుదలగా ఉంది. మరి చెన్నై జోరు ముందు కోల్ కతా ఎంత వరకు నిలుస్తుందో చూడాలి. ఇక నిన్న జరిగిన మ్యాచ్ లో ముంబై పై పంజాబ్ 13 పరుగుల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ 8 వికెట్ల నష్టానికి 214 పరుగుల భారీ లక్ష్యాన్ని ముంబై ముందు ఉంచగా.. రోహిత్ సేన 201 పరుగులకే కుప్పకూలింది.

Also Read:IPL 2023:ముంబైకి తప్పని భంగపాటు

- Advertisement -