IPL 2023:టాపర్స్ ఫైట్.. రాజస్తాన్ vs లక్నో!

45
- Advertisement -

నేటి ఐపీఎల్ లో మరో ఆసక్తికరమైన పోరు జరగనుంది. టేబుల్ టాప్ జట్లు అయిన రాజస్తాన్ మరియు లక్నో తలపడనున్నాయి. సవై మాన్సింగ్ ఇండోర్ స్టేడియంలో జరగనున్న ఈ మ్యాచ్ రాత్రి 7:30 నిముషాలకు ప్రారంభం కానుంది. ఇరు జట్లు కూడా పటిష్టమైన జట్లు కావడంతో అభిమానులు ఈ మ్యాచ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వరుస విజయాలతో ఈ సీజన్ లో అద్భుతంగా రాణిస్తున్న రాజస్తాన్ రాయల్స్ ఇప్పటికే 5 మ్యాచ్ లు ఆడి అందులో నాలుగు విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఇక లక్నో కూడా ఆడిన 5 మ్యాచ్ లలో మూడు విజయాలు సాధించి రెండో స్థానంలో ఉంది. దీంతో రెండు టాప్ జట్లు కావడంతో ఈ మ్యాచ్ లో ఏ జట్టు విజయం సాధిస్తుందో అనే ఉత్కంఠ నెలకొంది. ఇరు జట్ల బలాబలాల విషయానికొస్తే.. రెండు జట్లు కూడా బ్యాటింగ్, బౌలింగ్ అన్నీ విభాగాల్లోనూ పటిష్టంగా కనిపిస్తున్నాయి.

Also Read:ఆధిక దాహం వేస్తోందా.. జాగ్రత్త !

పడిక్కల్, సంజు సంసాన్, రియన్ పరాగ్, హెట్మియర్ వంటి ఆటగాళ్లతో రాజస్తాన్ బ్యాటింగ్ లైనప్ దుర్బేద్యంగా ఉంది. ఇక బౌలింగ్ లో యజువేంద్ర చహల్, సైని, జంపా వంటి బౌలర్స్ ఫుల్ సింగ్ లో ఉన్నారు. ఇక లక్నో కూడా తామేం తక్కువ కాదన్నట్లుగా అన్నీ విభాగాల్లోనూ బలంగా ఉంది. కెప్టెన్ కే‌ఎల్ రాహుల్, మరియు స్టెయినెన్ ఆ జట్టుకు ప్రధాన బలం, ఇంకా పురాన్ కూడా అద్బుతమైన ఫామ్ లో ఉన్నాడు. వీళ్ళు ఏమాత్రం చెలరేగిన లక్నో కు తిరుగుండదు. ఇక బౌలింగ్ లోనూ ఆవేష్ ఖాన్, అమిత్ మిశ్రా, దీపక్ హుడా వంటి వాళ్ళుతో బౌలింగ్ దళం కూడా పటిష్టంగానే ఉంది. దీంతో రెండు జట్లు కూడా సమవుజ్జీలుగా ఉండడంతో ఈ మ్యాచ్ అభిమానులకు ఫుల్ వినోదాన్ని పంచుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక నిన్న జరిగిన సన్ రైజర్స్ మరియు ముంబై ఇండియన్స్ మద్య జరిగిన మ్యాచ్ లో ముంబై ఘన విజయం సాధించింది. ఈ విజయంతో ముంబై హ్యాట్రిక్ విజయాలను ఖాతాలో వేసుకోగా, సొంత గడ్డపై ఎస్‌ఆర్‌హెచ్ కు నిరాశ తప్పలేదు.

Also Read:పవన్ ను భయపెడుతున్న సెంటిమెంట్ ?

- Advertisement -