IPL 2023:ముంబై, ఆర్సీబీ.. ప్లే ఆఫ్ బెర్త్ ఎవరికి ?

28
- Advertisement -

ఐపీఎల్ తుది అంఖానికి చేరుకుంది. ప్లే ఆఫ్ కు వెళ్ళే జట్లు ఏవో నిన్నటితో తేలిపోయింది. మొదటగా గుజరాత్ టైటాన్స్ ప్లే ఆఫ్ చేరుకోగా ఆ తరువాత బెర్త్ ల కోసం జరిగిన రసవత్తరమైన పోరులో నిన్నటితో అందరికీ ఓ క్లారిటీ వచ్చింది. నిన్న జరిగిన మ్యాచ్ లలో డిల్లీపై గెలిచిన చెన్నై, అలాగే కోల్ కతా పై విజయం సాధించిన లక్నో జట్లు ప్లే ఆఫ్ కు చేరుకున్నాయి. ఇక మిగిలిన ఒక్క స్థానం కోసం ముంబై, మరియు బెంగళూరు జట్లు పోటీ పడుతున్నాయి. నేడు డబుల్ ధమాకా లో హైదరబాద్ తో ముంబై మరియు గుజరాత్ తో బెంగళూరు తలపడుతున్నాయి. హైదరబాద్ సన్ రైజర్స్ జట్టు ఇప్పటికే ప్లే ఆఫ్ నుంచి నిష్క్రమించగా ముంబై ఇండియన్స్ ప్లే ఆఫ్ కు వెళ్లాలంటే హైదరబాద్ జట్టు ను భారీ తేడాతో ఓడించాల్సి ఉంటుంది.

Also Read:అంతర్జాతీయ టీ దినోత్సవం..

ఇక మరోవైపు ఇప్పటికే ప్లే ఆఫ్ కు వెళ్ళిన గుజరాత్ టైటాన్స్ జట్టుకు ఆర్సీబీతో మ్యాచ్ నామమాత్రమే అయినప్పటికి, ఆర్సీబీకి మాత్రం ఈ మ్యాచ్ కీలకం. ఈ మ్యాచ్ లో తప్పక గెలిస్తేనే ఆర్సీబీ ప్లే ఆఫ్ కు వెళ్ళే అవకాశాలు ఉంటాయి. అటు ముంబై ఇండియన్స్ మరియు ఇటు బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ రెండు జట్లు కూడా 14 పాయింట్లతో సమంగా ఉన్నాయి. అయితే రన్ రేట్ పరంగా ఆర్సీబీ కొంత ముందుంది.. దీంతో ఒకవేళ ఇరు జట్లు నేడు జరిగే మ్యాచ్ లలో గెలిచినప్పటికి రన్ రేట్ కీలకం కానుంది. మరి ఒకవేళ ఈ రెండు జట్లు ఓడిపోతే అనూహ్యంగా రాజస్తాన్ రాయల్స్ రేస్ లోకి వస్తుంది. అప్పుడు కూడా నెట్ రన్ రేట్ కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. ఆవిధంగా చూస్తే రాజస్తాన్ రాయల్స్ ప్లే ఆఫ్ కు చేరిన ఆశ్చర్యం లేదు. మరి చివరి ప్లే ఆఫ్ బెర్త్ కోసం ఆర్సీబీ, ముంబై ఇండియన్స్, రాజస్తాన్ రాయల్స్ పోటీ పడుతున్న నేపథ్యంలో ఏ జట్టు ప్లే ఆఫ్ కు వెళుతుందో చూడాలి.

Also Read:అందరికీ కనెక్ట్ అయ్యే సినిమా.. ‘మేమ్ ఫేమస్’

- Advertisement -