IPL 2023:ముంబై హ్యాట్రిక్ గెలుపు

54
- Advertisement -

ఐపీఎల్ 2023లో ముంబై హ్యాట్రిక్ విజయాలను నమోదుచేసింది. ఉప్పల్ వేదికగా సన్ రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై 14 పరుగుల తేడాతో విజయం సాధించింది. 193 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన హైదరాబాద్ 19.5 ఓవర్లలో 178 పరుగులకు ఆలౌట్‌ అయింది.

Also Read:కుటుంబ బంధాల విలువే రామబాణం: ఖుష్బూ

టాప్ ఆర్డర్ అంతా విఫలం కావడంతో హైదరాబాద్‌కు ఓటమి తప్పలేదు. హ్యారీ బ్రూక్ 9,త్రిపాఠి, మార్‌క్ర‌మ్‌(22), మ‌యాంక్ అగ‌ర్వాల్‌(48), అభిషేక్ శ‌ర్మ‌(1), క్లాసెన్(36; 16 బంతుల్లో4 ఫోర్లు 2సిక్స్‌) పరుగులు చేశారు.

అంత‌క‌ముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఇండియ‌న్స్ కు ఓపెన‌ర్లు రోహిత్ శ‌ర్మ(28), ఇషాన్ కిష‌న్‌(38)లు శుభారంభం ఇచ్చారు. కామెరూన్ గ్రీన్(64 నాటౌట్; 40 బంతుల్లో 6 ఫోర్లు, 2సిక్స‌ర్లు, తిల‌క్ వ‌ర్మ‌(37; 17 బంతుల్లో 2 ఫోర్లు, 4సిక్స‌ర్లు) రాణించారు.

Also Read:కర్నాటకలో ఫ్యామిలీ పాలిటిక్స్ !

- Advertisement -