IPL 2023 : లక్నో vs ముబై.. గెలిస్తే ప్లేఆఫ్ కే !

50
- Advertisement -

ఐపీఎల్ చివరి దశకు చేరుకోవడంతో ప్లే ఆఫ్ బెర్త్ ల కోసం రసవత్తరమైన పోరు నడుస్తోంది. ఇప్పటికే డిల్లీ క్యాపిటల్స్, సన్ రైజర్స్ హైదరబాద్ ఇంటిముఖం పట్టగా.. పంజాబ్, రాజస్తాన్, కోల్ కతా జట్లు ప్లే ఆఫ్ బెర్త్ ల కోసం తటపటాయిస్తున్నాయి. ఇక నిన్న జరిగిన గుజరాత్ టైటాన్స్ మరియు సన్ రైజర్స్ హైదరబాద్ మ్యాచ్ లో గుజరాత్ గ్రాండ్ విక్టరీ సాధించడంతో ఘనంగా ప్లే ఆఫ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇక తరువాత ఏ జట్టు ప్లే ఆఫ్ బెర్త్ కన్ఫర్మ్ చేసుకుంటుంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. నేటి ఐపీఎల్ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ మరియు లక్నో సూపర్ జెయింట్స్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్ లో ఏ జట్టు గెలిచిన ప్లే ఆఫ్ బెర్త్ దాదాపు ఖాయమైనట్టే..

Also Read:Horse gram:వామ్మో.. ఉలవలతో ఎన్ని ప్రయోజనాలో!

ఇప్పటివరకు 12 మ్యాచ్ లు ఆడిన ముంబై 7 విజయాలు సాధించి 14 పాయింట్లతో మూడో స్థానంలో కొనసాగుతోంది. ఈ మ్యాచ్ గెలిస్తే 16 పాయింట్లతో రెండో స్థానానికి చేరుతుంది. ఇక మరోవైపు 12 మ్యాచ్ లు ఆడిన లక్నో ఆరు విజయాలతో 13 పాయింట్లతో నాలుగో స్థానంలో కొనసాగుతోంది. ఒకవేళ లక్నో గెలిచిన టాప్ 2 చేరుకుంటుంది. దాంతో ప్లే ఆఫ్ బెర్త్ అటు ముంబైకి ఇటు లక్నో కు సమదూరంలో ఉందనే చెప్పవచ్చు. బలాబలాల విషయానికొస్తే రెండు జట్లు కూడా పటిష్టంగానే కనిపిస్తున్నాయి. సీజన్ ప్రారంభంలో ముంబై వరుస ఓటములపాలైగా ప్రస్తుతం వరుస విజయాలతో ఇతర జట్లకు టఫ్ ఫైట్ ఇస్తోంది. రోహిత్ ఫామ్ లేమితో ఇబ్బందిపడుతున్నప్పటికి ఇతర ఆటగాళ్లు సమిష్టిగా రాణిస్తుండడం ముంబైకి కలిసొచ్చే అంశం. అటు లక్నో బ్యాటింగ్ విభాగంలో పటిష్టంగా ఉన్నప్పటికి.. బౌలింగ్ లో విఫలం అవుతూ వస్తోంది. మరి ఈ ఆసక్తికరమైన పోరులో ఏ జట్టు విజయం సాధించి ప్లే ఆఫ్ బెర్త్ కన్ఫర్మ్ చేసుకుంటుందో చూడాలి.

- Advertisement -