ఐపీఎల్ 16వ సీజన్ నేటి నుండి ప్రారంభంకానుంది. తొలి మ్యాచ్‌లో చెన్నైతో తలపడనుంది గుజరాత్. ఇక ఈసారి ఐపీఎల్ సరికొత్తగా ఉండనుంది. టాస్ తర్వాత తుది జట్టు వెల్లడి వైడ్, నోబాల్స్‌కు సమీక్ష విధానం, ఇంపాక్ట్ ప్లేయర్ ఇలా ఎన్నో కొత్త నిబంధనలు రానున్నాయి.
ఈ సారి రెండు కొత్త జట్లతో మొత్తం 10 జట్లు టైటిల్ కోసం పోటీ పడుతున్నాయి. శుభ్‌మన్ గిల్, రషీద్ ఖాన్, డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా, కేన్ విలియమ్సన్, హార్దిక్ పాండ్యాతో కూడిన గుజరాత్‌ను ఎదుర్కోవాలంటే చెన్నై శక్తికి మించి పోరాడక తప్పేలా కనిపించడం లేదు.
గుజరాత్ బౌలింగ్‌కు మహమ్మద్ షమీ, రషీద్ ఖాన్, హార్దిక్ కీలకం కానుండగా.. వికెట్ కీపర్‌గా ఎవరిని ఆడిస్తారనేది ఆసక్తికరంగా మారింది. వృద్ధిమాన్ సాహా, శ్రీకర్ భరత్ రూపంలో ఇద్దరు దేశీయ వికెట్ కీపర్‌లు గుజరాత్‌కు అందుబాటులో ఉన్నారు. ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధనతో బరిలోకి దిగుతున్న ఆటగాళ్ల సంఖ్య 12కు చేరింది.తొలుత బ్యాటింగ్ చేసిన జట్టు.. ఫీల్డింగ్ సమయంలో అదనపు బౌలర్ కావాలనుకుంటే.. ఒక బ్యాటర్‌ను తప్పించి అతడి స్థానంలో స్పెషలిస్ట్ బౌలర్‌ను బరిలోకి దింపొచ్చు.
ఇవి కూడా చదవండి..