IPL 2023:నేడైనా జరిగేనా.. ఫైనల్ వార్?

47
- Advertisement -

ఐపీఎల్ లో గుజరాత్ టైటాన్స్ మరియు చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మద్య ఫైనల్ మ్యాచ్ నిన్న వర్షార్పణం అయిన సంగతి తెలిసిందే. దాదాపు 5 గంటల పాటు ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షం కారణంగా మ్యాచ్ సోమవారానికి వాయిదా వేయక తప్పలేదు. దాంతో ఫైనల్ మ్యాచ్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన అభిమానులు తీవ్ర నిరాశకు లోనయ్యారు. కనీసపు ఓవర్లు నిర్వహించడానికి కూడా వీలు లేని విధంగా వర్షం కురవడంతో గ్రౌండ్ తడిసి ముద్దయింది. దాంతో ఈ 16 ఏళ్ళే ఐపీఎల్ సీజన్స్ మొత్తంలో రిజర్వ్ డేట్ లేకుండా ఫైనల్ మ్యాచ్ ను మరొకరోజుకు వాయిదా వేయడం ఇదే మొదటిసారి. .

ఇక ఇప్పటికే మ్యాచ్ చూసేందుకు టికెట్లు కొనుగోలు చేసిన అభిమానులు.. అదే టికెట్లతో సోమవారం జరిగే మ్యాచ్ వీక్షించవచ్చని నిర్వాహకులు తెలిపారు. దాంతో నేడు జరిగే ఫైనల్ మ్యాచ్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే నేడు కూడా వర్షం అడ్డంకిగా మారే అవకాశం ఉందని వాతావరణశాఖ నుంచి అప్డేట్స్ వస్తుండడంతో నిర్వాహకులు, అటు అభిమానులు ఆందోళనకు గురౌతున్నారు. ఒకవేళ నేడు కూడా వర్షం పడి మ్యాచ్ రద్దు అయితే లీగ్ దశలో టేబుల్ టాపర్ గా ఉన్న గుజరాత్ టైటాన్స్ ను ఛాంపియన్ గా ప్రకటించే అవకాశం ఉంది.

Also Read:Califlower:కాలీఫ్లవర్ తో లాభాలు

దీంతో చెన్నై అభిమానులు తీవ్ర ఆందోళనకు గురౌతున్నారు. నేడు మ్యాచ్ కు వర్షం అడ్డంకిగా మారకూడదని ప్రార్థనలు చేస్తున్నారు. అయితే వర్షం కారణంగా మ్యాచ్ ఆలస్యంగా ప్రారంభం అయిన అది గుజరాత్ కు ప్లెస్ అవుతుందని విశ్లేషకులు చెబుతున్నారు. ఎందుకంటే చెన్నై ప్రధాన బలం బ్యాటింగ్ మరియు స్పిన్ బౌలింగ్.. స్పిన్ కు పిచ్ ఏ మాత్రం సహకరించకపోతే.. గుజరాత్ జట్టు పై చేయి సాధించే అవకాశం ఉంది. ఒకవేళ మ్యాచ్ పూర్తిగా రద్దయిన గుజరాత్ జట్టే ఛాంపియన్ గా నిలుస్తుంది. దీంతో ఎటొచ్చీ గుజరాత్ కే అనుకూలతలు ఎక్కువగా ఉన్నాయని విశ్లేషకులు చెబుతున్నారు.

Also Read:టర్కీ అధ్యక్షుడిగా ఎర్డోగాన్‌

- Advertisement -