ఐపీఎల్ 2023 వేలానికి రంగం సిద్ధమైంది. డిసెంబర్ 23న వేలానికి రంగం సిద్ధంకాగా శుక్రవారం మధ్యాహ్నం 2.30 గంటలకు వేలం ప్రారంభం కానుంది.మొత్తం 991 మంది ఆటగాళ్లు వేలానికి దరఖాస్తు చేసుకోగా.. 405 మంది ఆటగాళ్లను ఫ్రాంచైజీలు వేలానికి షార్ట్‌లిస్ట్ చేశాయి. వీరిలో 273 మంది ఇండియన్ క్రికెటర్లు కాగా.. 132 మంది విదేశీ ఆటగాళ్లున్నారు.
నిబంధనల ప్రకారం ప్రతి ఫ్రాంచైజీ తమ పూర్తి బడ్జెట్లో 75 శాతం వరకు ఖర్చు చేయడానికి అనుమతిస్తారు. అంతకు మించి ఖర్చు చేయడం కుదరదు. ప్రతి జట్టులో కనీసం 18 మంది ఆటగాళ్లు గరిష్టంగా 25 మంది ఆటగాళ్లు ఉండాలి.
ఈసారి ఐపీఎల్ వేలంలో పాల్గొంటున్న అత్యంత పిన్న వయస్కుడు అప్ఘానిస్థాన్‌కు చెందిన కుడి చేతి వాటం ఆఫ్ స్పిన్నర్ అల్లాహ్ మహ్మద్ ఘజనఫర్ కాగా పెద్ద వయస్కుడు అమిత్ మిశ్రా.
రూ.2 కోట్ల బేస్ ప్రైజ్‌లో ఉన్న ఆటగాళ్లు: టామ్ బాంటన్, సామ్ కర్రన్, క్రిస్ జోర్డాన్, తైమల్ మిల్స్, జేమీ ఓవర్టన్, క్రెయిగ్ ఓవర్టన్, అదిల్ రషీద్, ఫిల్ సాల్ట్, బెన్ స్టోక్స్, కామెరాన్ గ్రీన్, ట్రావిస్ హెడ్, క్రిస్ లిన్, కేన్ విలియమ్సన్, ఆడమ్ మిల్నే, జిమ్మీ నీషామ్, రైలీ రూసో, రాసీ వాన్ డెన్ డస్సెన్, జేసన్ హోల్డర్, నికోలస్ పూరన్.
కోటిన్నర రూపాయల బేస్ ప్రైజ్ జాబితా: సీన్ అబాట్, రిలీ మెరిడిత్, జై రిచర్డ్‌సన్, ఆడమ్ జంపా, షకీబ్ అల్ హసన్, హ్యారీ బ్రూక్, విల్ జాక్స్, డేవిడ్ మలాన్, జేసన్ రాయ్, షెర్ఫానే రూథర్‌ఫర్డ్, నాథన్ కౌల్టర్ నైల్.
కోటి రూపాయల బేస్ ప్రైజ్: మయాంక్ అగర్వాల్, మనీష్ పాండే, మహ్మద్ నబీ, ముజీబ్ ఉర్ రెహ్మాన్, మోసిస్ హెన్రిక్స్, ఆండ్రూ టై, జో రూట్, ల్యూక్ వుడ్, మిచెల్ బ్రాస్‌వెల్, కైల్ జెమీసన్, మాట్ హెన్రీ, టామ్ లాథమ్, డారెల్ మిచెల్, హెన్రిక్ క్లాసేన్, షంసీ, కుశాల్ పెరీరా, రోస్టన్ ఛేజ్, రఖీమ్ కార్న్‌వల్, షాయ్ హోప్, డేవిడ్ వైజ్.