- Advertisement -
కరోనా వైరస్ ఎఫెక్ట్‌తో ఇప్పటికే పలు క్రికెట్ టోర్నమెంట్‌లతో పాటు వివిధ అంతర్జాతీయ టోర్నీలు రద్దయ్యాయి. తాజాగా అత్యధిక ఆదరణ కలిగిన ఐపీఎల్ కూడా రద్దయ్యే అవకాశం కనిపిస్తోంది.
వాస్తవానికి షెడ్యూల్ ప్రకారం ఐపీఎల్ మార్చి 29 నుండి ప్రారంభంకావాల్సి ఉండగా కరోనా నేపథ్యంలో ఏప్రిల్ 15కు రీ షెడ్యూల్ చేశారు. అయితే ఏప్రిల్ 15 నుంచి కూడా ఐపీఎల్ జరిగేది అనుమానాస్పదంగానే కనిపిస్తోంది.
ఈ నేపథ్యంలో సమావేశమైన అన్ని ఫ్రాంచైజీల యాజమాన్యాలు ఐపీఎల్ నిర్వహణపై బీసీసీఐతో అవగాహనకు రావాలని భావిస్తున్నాయి. ఈ ఏడాది ఐపీఎల్ లేకపోతే ఫ్రాంచైజీలు భారీగా నష్టపోయే అవకాశముంది. ఆటగాళ్లకు శాలరీల రూపంలో కోట్లాది రూపాయల నష్టాన్ని భరించాల్సి వస్తుంది. దీంతో ఐపీఎల్‌ను నిర్వహించేందుకు ప్రయత్నాలు జరుపుతూనే, ఒకవేళ రద్దయితే దానికి సంసిద్ధంగా ఉండాలని యోచిస్తున్నాయి.
- Advertisement -