ఐపీఎల్ మజా షురూ..

255
ipl 2019
- Advertisement -

ఐపీఎల్ మజా నేటి నుండి ప్రారంభంకానుంది. ఇప్పటివరకు 11 సక్సెస్‌ ఫుల్ సీజన్స్ పూర్తిచేసుకున్న ఐపీఎల్ తాజాగా 12వ సీజన్‌ కోసం సిద్ధమైంది. తొలి మ్యాచ్‌లో చెన్నై సూపర్‌కింగ్స్‌తో తలపడనుంది రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు.చెన్నై వేదికగా తొలి మ్యాచ్ జరగబోతోంది… చెన్నై సూపర్‌కింగ్స్‌, రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు మధ్య ఈ తొలి పోరు రాత్రి 8 గంటలకు ప్రారంభంకానుంది.

ఇక ఐసీఎల్‌ లీగ్‌లో చెన్నై అత్యంత విజయవంతమైన జట్టు.. మూడుసార్లు టైటిల్‌ గెలిచింది. రెండేళ్ల నిషేధం తర్వాత పెద్దగా అంచనాల్లేకుండా గత సీజన్‌లో బరిలోకి దిగిన ధోనీసేన అద్భుత ప్రదర్శనతో మరోసారి టైటిల్‌ ఎగరేసుకుపోయింది.

చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్టులో వాట్సన్‌, డుప్లెసిస్‌, సురేష్‌ రైనా, అంబటి రాయుడు, ఎంఎస్ ధోని, జాదవ్‌, డ్వేన్‌ బ్రావో, రవీంద్ర జడేజా, దీపక్‌ చాహర్‌, డేవిడ్‌ విల్లీ, మోహిత్‌ శర్మ ఉండగా రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు టీమ్‌లో పార్థివ్‌ పటేల్‌, మొయిన్‌ అలీ, విరాట్ కోహ్లి, డివిలియర్స్‌, హెట్‌మయర్‌, శివమ్‌ దూబె, వాషింగ్టన్‌ సుందర్‌, టిమ్‌ సౌథీ, ఉమేశ్‌ యాదవ్‌, సిరాజ్‌, చాహల్‌కు స్థానం లభించే అవకాశం ఉంది.

ఐపీఎల్‌ 2019 సీజన్‌లో మొత్తం 8 జట్లు పోటీపడుతుండగా ప్రతి జట్టూ లీగ్ దశలో 14 మ్యాచ్‌లు ఆడనుంది. ఇందులో 7 మ్యాచ్‌లను సొంతగడ్డపై.. మరో 7 మ్యాచ్‌ల్ని ప్రత్యర్థి జట్టు వేదికలపై ఆడనున్నాయి.

2008లో ప్రారంభమైన ఐపీఎల్‌లో ఇప్పటి వరకూ 11 సీజన్లు పూర్తవగా.. చెన్నై, ముంబయి జట్లు మూడు సార్లు విజేతగా నిలవగా.. కోల్‌కతా రెండు సార్లు, సన్‌రైజర్స్ హైదరాబాద్, డక్కన్ ఛార్జర్స్, రాజస్థాన్ రాయల్స్ ఒక్కోసారి టైటిల్‌ను గెలిచాయి. బెంగళూరు, ఢిల్లీ, పంజాబ్ జట్లు ఒక్కసారి కూడా టైటిల్ గెలవలేకపోయాయి.

ఐపీఎల్-2019 జట్లు ఇవే…

1. చెన్నై సూపర్ కింగ్స్
2. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు
3. సన్‌రైజర్స్ హైదరాబాద్
4. ఢిల్లీ క్యాపిటల్స్ (ఢిల్లీ డేర్‌డెవిల్స్ పేరు మార్చుకుంది)
5. కింగ్స్ ఎలెవన్ పంజాబ్
6. రాజస్థాన్ రాయల్స్
7. కోల్‌కతా నైట్‌రైడర్స్
8. ముంబయి ఇండియన్స్

- Advertisement -