నిన్న కట్టుదిట్టమైన భద్రత మధ్య తమిళనాడులో చెన్నై, కోల్కత్తా మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. కావేరి బోర్డు ఏర్పాటు కోసం తమిళనాట ప్రజలు నిరసనలు తీవ్రతరం చేశారు. నిన్న ఐపీఎల్ మ్యాచ్ అడ్డకునేందు ప్రయత్నించారు. చెన్నైలో ఐపీఎల్ మ్యాచ్లు నిర్వహించవద్దంటూ తమిళ సంఘాల, ప్రజా సంఘాలు స్టేడియం దగ్గర ఆందోళనలు చేశాయి. అయితే 4 వేల మంది పోలీసులతో కట్టుదిట్టమైన భద్రత మధ్య నిన్నటి మ్యాచ్ ముగిసిపోయింది. ఈ నేపథ్యంలో చెన్నైలో మిగతా మ్యాచ్లు విశాఖలో నిర్వహించనున్నారు.
మరోవైపు కావేరి బోర్డు ఏర్పాటుకు అందరు ఆందోళన చేస్తున్న నేపథ్యంలో ఐపీఎల్ నిర్వహించడం మంచిది కాదన్నారు సూపర్ స్టార్ రజనీకాంత్. రాజకీయ నేతలు సైతం ఐపీఎల్ పై మండిపడుతున్నారు. ఇప్పటికే మ్యాచ్లు నిర్వహించవద్దంటూ నిన్న చిదంబరం స్టేడియం వద్ద తమిళ సంఘాలు, ప్రజా సంఘాలు ఆందోళన చేశాయి. స్టేడియం లోపల చెప్పులు విసరడం, నినాదాలు చేసి నిరసనలను వ్యక్తం చేశారు. ఇలాంటి సమయంలో చెన్నైలోని మిగతా మ్యాచ్లు విశాఖలో నిర్వహించనున్నారు.