ఐపీఎల్ స్టార్ట్ అవడానికి ఇంకా రెండు రోజులు మాత్రమే ఉంది. ఈ క్రమంలోనే బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ ఐపీఎల్ ప్రారంభ వేడుకలకు రెడీ అయిపోతున్నాడు. మొదట్లో రణ్ వీర్ సింగ్ ఆరంభ వేడుకల్లో సందడి చేయనున్నాడని వార్తలొచ్చాయి.
అయితే ఫుడ్ బాల్ మ్యాచ్ సందర్భంగా గాయపడిన రణ్ వీర్ ను వైద్యులు విశ్రాంతి తీసుకోవాల్సిందిగా సూచించడంతో..హృతిక్‌ని సంప్రదించారు ఐపీఎల్ నిర్వాహకులు.
అయితే ఐపీఎల్ నిర్వాహకులు వరుణ్ ధావన్ ను సంప్రదించగా అతను 6 కోట్లు డిమాండ్ చేసినట్టు టాక్. ఈ క్రమంలోనే హృతిక్‌ని సంప్రదించగా.. గ్సీన్ సిగ్నల్ ఇచ్చాడని, దాంతో ప్రాక్టిస్ కూడా స్టార్ట్ చేశాడని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఐపీఎల్ ప్రారంభవేడుకల్లో హృతిక్ ‘ధూమ్-2’, ‘కహో నా ప్యార్ హై’, ‘లక్కీ బై ఛాన్స్’, ‘జిందగీ నా మిలేగి దుబారా’ సినిమాల్లోని పాటలకు డ్యాన్స్ చేయనున్నాడని సమాచారం.
ఇక ఈ వేడుకల్లో వరుణ్ ధావన్, జాక్వలైన్ ఫెర్నాండేజ్, పరిణితి చోప్రా తదితరులు సందడి చెయ్యనున్నారని తెలుస్తోంది. ఇదిలా ఉండగా..శనివారం ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఐపీఎల్ ప్రారంభవేడుకలు జరగనున్నాయి.