ఆరంభం అదిరింది..

306
Kohli will go shirtless if we win the world cup
- Advertisement -

ఇండియన్ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్)-11 ఆరంభం అదిరింది. శనివారం ముంబైలోని వాంకెడ్‌ స్టేడియంలో స్టార్ట్‌ అయిన ఈ సీజన్‌, క్రికెట్ అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని తెచ్చింది. ఈ వేడుకల్లో సినీ స్టార్స్ హృతిక్‌ రోషన్‌, వరుణ్‌ ధావన్‌, ప్రభుదేవా, తమన్నా భాటియా, జాక్వలిన్‌ ఫెర్నాండేజ్‌లు స్పెషల్‌ అట్రాక్షన్‌గా నిలిచారు.

బాలీవుడ్‌ స్టార్ వరుణ్‌ ధావన్‌ ఏబీసీడీ మూవీలోని సాంగ్‌కు డాన్సర్లతో కలిసి స్టెప్పులేశాడు. అనంతరం ప్రభుదేవా తన డాన్స్‌తో ఫ్యాన్స్ల మంచి జోష్ ను తీసుకొచ్చాడు. కాగా..ముక్కాలా సాంగ్‌ కు వరుణ్‌ ధావన్‌తో కలిసి ప్రభుదేవా వేసిన స్టెప్పులు అభిమానులను ఉర్రూతలూగించింది.

ఇక మిల్కీబ్యూటీ తమన్నా..బాహుబలి టైటిల్ సాంగ్‌ తో ఎంట్రీ ఇచ్చి, ఏకేజాను పాటతో పాటు జైలవకుశలోని స్వింగ్‌జరా సాంగ్‌కు చిందేసింది. కాగా.. బాలీవుడ్‌ నటి జాక్వలిన్ ఫెర్నాండేజ్‌ తన డాన్స్త్ తో మరింత ఊపునుతీసుకొచ్చారు.

ఇక ఈ వేడకుకు పెద్దమొత్తంలో అభిమానులు హజరయ్యారు. ఆరంభపు మ్యాచ్‌లో తలపడే ముంబై ఇండియన్స్‌-చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్లకు చెందిన ఆటగాళ్లు, సిబ్బంది, ఐపీఎల్‌ చైర్మన్‌ రాజీవ్‌ శుక్లాలు పాల్గొన్నారు.

- Advertisement -