హరిప్రియ క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రణదీప్ ఠాకోర్ దర్శకత్వం వహిస్తూ నిర్మించిన చిత్రం ‘రక్షణ’. పాయల్ రాజ్‌పుత్ మెయిన్ లీడ్‌గా నటించిన ఈ చిత్రం జూన్ 7న విడుదల కాబోతోంది. ఇప్పటికే రక్షణ టీజర్, ట్రైలర్‌లు ఆడియెన్స్‌ను ఆకట్టుకున్నాయి. ఇక ఈ మూవీ విశేషాలను పంచుకునేందుు దర్శక నిర్మాత ప్రణదీప్ ఠాకోర్ మీడియా ముందుకు వచ్చారు. ఆయన చెప్పిన చిత్ర విశేషాలివే..
‘రక్షణ’ సినిమా మొత్తం ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌గా ఉంటుంది. బాధితుల కోసం పోరాడే పాత్ర, వారిని రక్షించే కారెక్టర్ కాబట్టి.. సినిమాకు రక్షణ అనే టైటిల్ పెట్టాం. దాని కంటే ముందు రక్షక్ అని తెలంగాణ పోలీసుల వాహనాల పేర్లను కూడా అనుకున్నాం. చివరకు రక్షణ టైటిల్‌ను ఫిక్స్ చేశాం. పూర్తిగా రియలిస్టిక్ అప్రోచ్‌లో సినిమా ఉంటుంది.
కథ రాస్తున్నప్పుడు ఎవ్వరినీ దృష్టిలో పెట్టుకోలేదు. అలా ఓ కారెక్టర్‌ను అనుకుని కథను రాసుకుంటూ వచ్చాను. పోలీస్ పాత్రకు తగ్గ ఫిజిక్ ఉండాలని అనుకున్నాను. ఆ టైంలో ఆర్ఎక్స్ 100 వచ్చింది. ఆమెకు ఈ పాత్ర బాగుంటుందని అనుకున్నాం. అప్రోచ్ అయ్యాం. ఆమెకు కథ బాగా నచ్చింది. అలా సినిమా స్టార్ట్ అయింది.
ఈ సినిమా షూటింగ్ మొత్తంగా 57 రోజులు జరిగింది. అందులో పాయల్ గారిది 47 రోజుల పాటు షూట్ జరిగింది. అగ్రిమెంట్ ప్రకారం ఆమె ప్రమోషన్స్‌కి రావాలి. ప్రమోషన్స్‌కి వచ్చాక బ్యాలెన్స్ అమౌంట్ ఆరు లక్షలు ఇస్తామని చెప్పాను. మంగళవారం తరువాత ఈ మూవీని ప్రమోట్ చేయాల్సింది. కానీ వచ్చేందుకు సుముఖత వ్యక్తం చేయలేదు. ఈ సినిమాకు ఆమె మాత్రమే ముఖ్యం. నేను ఓ కొత్త దర్శక నిర్మాతని. నన్ను ఎవ్వరూ చూడరు. నా మాటలు ఎవ్వరూ వినరు. కాబట్టి ఆమె రావాల్సిందే అని ప్రొడ్యూసర్ కౌన్సిల్‌లో ఫిర్యాదు చేశాను. 20 లక్షలు ఇస్తే వర్చువల్‌గా ప్రమోట్ చేస్తారని ఆమె మేనేజర్ సౌరభ్ ధింగ్రా చెప్పారు.
పాయల్ తన పాత్రలో అద్భుతంగా నటించారు. ఈ వివాదం పక్కన పెడితే.. ఆమె ప్రమోషన్స్‌కి రాకపోయినా ఆమెకు ఇవ్వాల్సిన బ్యాలెన్స్ అమౌంట్ ఇచ్చేస్తాను. నాకు నా కథ, నా సినిమా మీద నమ్మకం ఉంది. నాకు మంచి డిస్ట్రిబ్యూటర్లు దొరికారు. సినిమాను భారీ ఎత్తున రిలీజ్ చేయబోతోన్నాను.
పాయల్ రాజ్‌పుత్‌కు ఉన్న ఇమేజ్ వేరు.. చేస్తున్న సినిమా వేరు.. అని చాలా మంది అన్నారు. కానీ కొత్త కొత్త పాత్రలు చేసినప్పుడే హీరో హీరోయిన్లను జనాలు ఆధరిస్తుంటారు. అందుకే పాయల్ ఈ పాత్రకు బాగుంటుందని అనుకున్నాను. ఆమె అద్భుతంగా నటించారు.
Also Read:17 నుండి పద్మావతి అమ్మవారి తెప్పోత్సవాలు
గుణ శేఖర్ గారి వద్ద ఒక్కడు, సైనికుడు, రుద్రమ దేవి సినిమాలకు అసిస్టెంట్, కో డైరెక్టర్‌గా పని చేశాను. ఆనంద్ రంగా ‘ ఓయ్ ‘ చిత్రానికి, బొమ్మరిల్లు భాస్కర్ ‘ ఆరంజ్ ‘ సినిమాకి కో-డైరెక్టర్‌గా పని చేశాను. ఓ పెద్ద కథను పట్టుకుని చాలా వద్దకు వెళ్లాను. కానీ వర్కౌట్ కాలేదు. అందుకే ఓ చిన్న సినిమాను నేనే తీయాలని అనుకున్నాను.
సినిమా తీయడం అనేది క్రియేటివ్ థింగ్. సినిమాను రిలీజ్ చేయడం మార్కెటింగ్ థింగ్. నేను సినిమాను బాగానే తీశాను. కానీ మార్కెటివ్ థింగ్‌లో చాలా పూర్. అందుకే సొంతంగా ఓ నిర్మాతను పట్టుకోలేకపోయాను. ఈ రోజుల్లో సినిమాను తీయడం కంటే.. రిలీజ్ చేయడమే కష్టంగా మారింది.
ఓ పోలీస్ ఆఫీసర్ జీవితంలో జరిగిన ఘటనను స్పూర్తిగా తీసుకుని కల్పిత కథను అల్లుకున్నాను. ఈ సినిమాలో సందేశం కూడా ఉంటుంది. అలా అని సూక్తులు బోధించినట్టుగా, ఉపన్యాసాలు ఇచ్చినట్టుగా ఉండదు. రక్షణ సినిమా తరువాత పాయల్ గారి ఇమేజ్ పూర్తిగా మారుతుంది. కొత్త పాయల్ రాజ్‌పుత్‌ను చూస్తారు. ఆమెకు ఇకపై మరింత పవర్ ఫుల్ రోల్స్ వస్తాయి.ఓటీటీ, శాటిలైట్ రైట్స్ ఇంకా అవ్వలేదు. ట్రైలర్, టీజర్ నచ్చితే.. మా సినిమాను థియేటర్లో మాత్రమే చూడండి.