ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్…’ఎలెవెన్’

36
eleven
- Advertisement -

నవీన్ చంద్ర హీరోగా లోకేశ్ అజ్ల్స్ దర్శకత్వంలో ‘సిల నేరంగాలిల్ సిల మణిధర్‌గళ్’, ‘సెంబి’ లాంటి విజయవంతమైన చిత్రాలని అందించిన ఎఆర్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రొడక్షన్ నెంబర్3గా అజ్మల్ ఖాన్, రేయా హరి ఓ రేసీ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ‘ఎలెవెన్’ అంటే టైటిల్ ని ఖారారు చేశారు. ఈ చిత్రం పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైయింది.

‘కలకలప్పు 2’, ‘వంద రాజవతాన్ వరువెన్’, ‘యాక్షన్’ చిత్రాలలో దర్శకుడు సుందర్ సి దగ్గర అసోసియేట్ డైరెక్టర్‌గా పనిచేసిన లోకేశ్ అజ్ల్స్ ‘ఎలెవెన్’ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.

ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో రూపొందుతోంది. నవీన్ చంద్ర ‘శరభం’, ‘శివప్పు , ‘బ్రమ్మన్’ లాంటి తమిళ చిత్రాలలో కూడా నటించారు. ప్రస్తుతం దర్శకుడు శంకర్ ‘గేమ్ ఛేంజర్’, కార్తీక్ సుబ్బరాజ్’జిగర్తాండ డబుల్ ఎక్స్’లలో కీలక పాత్రలు పోహిస్తున్నారు నవీన్ చంద్ర.

Also Read:ప్చ్.. తెలుగు హీరోలను అవమానపరిచారా?

‘సిల నెరంగళిల్ సిల మణిధర్గళ్’ చిత్రంలో నటించిన రేయా హరి కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో ‘విరుమండి’ ఫేమ్ అభిరామి, ‘వత్తికూచి’ ఫేమ్ దిలీపన్, ‘మద్రాస్’ ఫేమ్ రిత్విక కీలక పాత్రల్లో నటిస్తున్నారు.ఈ చిత్రానికి ప్రముఖ సాంకేతిక నిపుణులు పని చేస్తున్నారు. డి.ఇమ్మాన్ సంగీతం అందిస్తుండగా, బాలీవుడ్‌లో అనుభవం ఉన్న కార్తీక్ అశోక్ సినిమాటోగ్రఫర్ గా పని చేస్తున్నారు. జాతీయ అవార్డు గ్రహీత శ్రీకాంత్ ఎన్.బి ఎడిటర్.

‘ఎలెవెన్’ దర్శకుడు లోకేశ్ అజ్ల్స్ మాట్లాడుతూ ” మొదటి నుంచి చివరి వరకు ప్రేక్షకులకు సీట్ ఎడ్జ్ ఎక్స్ పీరియన్స్ ఇచ్చే ఫాస్ట్-పేస్డ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ఇది. ప్రతిభావంతులైన నటీనటుల, సాంకేతిక నిపుణులు ఈ చిత్రానికి పని చేస్తున్నారు. నిర్మాతలకు ధన్యవాదాలు. సినిమా అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను.” అన్నారు. ఈ చిత్రం షూటింగ్ ఆగస్ట్ 23 నుంచి ప్రారంభమవుతుంది.

Also Read:వరుడు వంగవీటి రాధా..అమ్మాయి ఎవరంటే?

- Advertisement -