ఎన్టీఆర్-నీల్..ఆసక్తికర టైటిల్!

4
- Advertisement -

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జోర్డాన్‌లో జరుగుతోంది. ఇప్పటివరకు ఈ సినిమాకు డ్రాగన్ అనే టైటిల్ ఫైనల్ అయినట్లు ప్రచారం జరిగింది.

అంతేగాదు ఈ సినిమాకు సంబంధించిన ఏ అప్‌డేట్ అయిన డ్రాగన్ పేరుతోనే వచ్చింది. అయితే నిర్మాత Ravi Yerneni ‘డ్రాగన్’ ఫైనల్ టైటిల్ కాదని, అది కేవలం వర్కింగ్ టైటిల్ మాత్రమేనని స్పష్టం చేశారు. తాజాగా ‘బ్రూస్ లీ’ అనే మరో టైటిల్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇదే అధికారిక టైటిల్ కావచ్చని ప్రచారం జరుగుతున్నప్పటికీ అఫిషియల్ అనౌన్స్‌మెంట్ రావల్సి ఉంది.

అయితే ఇదే టైటిల్‌తో రామ్ చరణ్ సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. ఈ పాన్ ఇండియా చిత్రంలో రుక్మిణి వసంత్, అనిల్ కపూర్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. 2026 జూన్ 25న విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది.

Also Read:డీసెంట్ కలెక్షన్స్‌తో ‘నిలవే’!

- Advertisement -