అసెంబ్లీ సమావేశం హాల్ లోపల ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. మిగతా సభ్యుల అందరికంటే ముందుగానే వెళ్లి తన చైర్ లో కూర్చున్నారు ప్రతిపక్ష నేత కేసిఆర్.
సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ హాల్లోకి రాగానే కెసిఆర్ దగ్గరికి వెళ్లి కరచాలనం చేశారు రేవంత్ రెడ్డి. సీఎం తర్వాత కేసీఆర్ దగ్గరికి వెళ్లి మంత్రుల కరచాలనం చేశారు మంత్రులు, ఎమ్మెల్యేలు.
కేసీఆర్ వద్దకు వచ్చి మర్యాద పూర్వకంగా కలిశారు సీఎం రేవంత్ రెడ్డి. కేసీఆర్ ను కలిసిన వారిలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, సీతక్క, వాకిటి శ్రీహరి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ప్రభత్వ విప్ లు బీర్ల ఐలయ్య, ఆది శ్రీనివాస్ పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, సీపీఐ ఎమ్మెల్యే కునమనేని సాంబశివరావు ఉన్నారు. అలాగే నూతన ఎమ్మెల్యే నవీన్ యాదవ్ కెసిఆర్ ని కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు.
Also Read:పెళ్లి తేదీ ప్రకటించిన అల్లు శిరీష్

