విక్టరీ వెంకటేష్ హీరోగా శైలేష్ కొలను దర్శకత్వంలో వస్తోన్న సినిమా సైంధవ్. జనవరి 13న రిలీజ్ కానున్న ఈ సినిమా గురించి ప్రస్తుతం వెంకటేష్ ఫుల్ ప్రమోషన్స్ చేస్తున్నారు. ఈ సందర్భంగా వెంకటేష్ పలు ఇంట్రెస్టింగ్ విషయాలను చెప్పారు. అందులో భాగంగా, ఈ సంక్రాంతికి మహేష్ బాబు గుంటూరు కారం, విక్టరీ వెంకటేష్ సైంధవ్ రెండూ రిలీజ్ కానున్నాయి. ఈ రెండు సినిమాలు పోటీ విషయంలో విక్టరీ వెంకటేష్ స్పందించాడు. “రెండు సినిమాలు ఒకేసారి రావడం సూపర్ ఫీలింగ్. చిన్నోడు గుంటూరు కారంతో వస్తే సూపర్ హిట్. పెద్దోడు సైంధవ్ గా వస్తే సూపర్ హిట్. తెలుగు ఆడియన్స్ ప్రతీ సినిమానూ ఆదరిస్తారని, నా తమ్ముడుకి ఆల్ ది బెస్ట్” అని వెంకటేష్ చెప్పుకొచ్చాడు.
అన్నట్టు టాలీవుడ్ లో ప్రస్తుతం రీరిలీజ్‌ల ట్రెండ్ నడుస్తోంది. ఇప్పటికే, పలువురు హీరోల సినిమాలు రీరిలీజ్ చేసి ఫ్యాన్స్ తమ ఆనందాన్ని తీర్చుకున్నారు. ఈ నేపథ్యంలో ‘‘మీరు నటించిన సినిమాల్లో రీరిలీజ్ చేసే ఛాన్స్ వస్తే ఏది చేస్తారు’’ అని వెంకటేష్ ను అడగ్గా, వెంటనే “నువ్వు నాకు నచ్చావ్” అనే సినిమా పేరు చెప్పారు. ఆ సినిమాను రీరిలీజ్ చేస్తే మళ్లీ ఎంచక్కా నవ్వుకోవచ్చని వెంకీ తెలిపాడు. ఇంతకీ, రానా నాయుడు 2 ఉంటుందా అంటే.. ?, ‘తప్పకుండా ఉంటుంది. ఈసారి నాగ వస్తాడు’ అంటూ వెంకటేష్ సమాధానమిచ్చాడు.
వెంకటేష్, రానా కలయికలో నెట్ ఫ్లిక్స్ లో వచ్చిన వెబ్ సిరీస్ రానా నాయుడు. వెంకటేష్ మొదటిసారి డిజిటల్ ఎంట్రీ ఇచ్చిన ఈ వెబ్ సిరీస్ కు మంచి ఆదరణ లభించింది. ఐతే, రానా నాయుడు సిరీస్ పై పలు విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇక సైంధవ్ విషయానికి వస్తే.. వెంకటేష్ హీరోగా శైలేష్ కొలను దర్శకత్వంలో వస్తోన్న యాక్షన్ థ్రిల్లర్ సైంధవ్. సైంధవ్ కథను నమ్మి ముందుకెళ్లామని, అందుకే ఎలాంటి ఒత్తిడిని మైండ్‌కు తీసుకోకుండా సైంధవ్‌ను తెరకెక్కించినట్లు వెంకీ తెలిపాడు.
Also Read:బెల్లంకొండ సాయి శ్రీనివాస్@ ‘టైసన్ నాయుడు’