ప్రభాస్ హీరోగా నటిస్తున్న ‘సలార్’ ట్రైలర్ నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రికార్డు స్థాయి వ్యూస్‌తో సోషల్ మీడియాలో ట్రెండ్ సృష్టిస్తోంది. ఈ క్రమంలో దర్శకుడు ప్రశాంత్ నీల్ మాట్లాడుతూ “షూటింగ్ ఎక్కువ భాగం రామోజీ ఫిల్మ్ సిటీలోనే పూర్తి చేశాం. అలాగే సింగరేణి మైన్స్, సౌత్ పోర్ట్స్, వైజాగ్ పోర్ట్స్‌లలో కూడా కొన్ని షెడ్యూళ్లు జరిపాం. సినిమా మొత్తాన్ని 114 రోజుల్లో పూర్తి చేశాం’’ అన్నారు. నిజంగా ఇది షాకింగ్ విషయమే. ఇంతటి భారీ యాక్షన్ ఎపిసోడ్స్ ఉన్న సినిమాని కేవలం 114 రోజుల్లో పూర్తి చేయడం చాలా గొప్ప విషయం.
అందుకే, ఫ్యాన్స్ కూడా ఈ విషయంలో షాక్ అవుతున్నారు. ఏది ఏమైనా ప్రశాంత్ నీల్ ఏం చేసినా చాలా కొత్తగా చేస్తాడని పేరు ఉంది. కాబట్టి, ఈ సినిమా పై భారీ బజ్ ఉంది. ఆ బజ్ కి తగ్గట్టుగానే ఈ సినిమా ఉండబోతుంది అని అంటున్నారు. ఇక ఈ సినిమా ట్రైలర్ నిన్న గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. ట్రైలర్ రిలీజైన కొద్దీ గంటల్లోనే 100 మిలియన్ ప్లస్ వ్యూస్ ని సాధించి యూట్యూబ్ లో ట్రేండింగ్ అవుతుంది. ట్రైలర్ లో యాక్షన్ తో పాటు ఎమోషన్స్ కూడా చాలా బాగున్నాయి.
ట్రైలర్ ఒక రేంజ్ లో ఉంటే.. సినిమా నెక్స్ట్ లెవల్లో ఉంటుందని ప్రభాస్ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. వసూళ్ల విషయంలో కూడా ఈ సినిమా రికార్డు సాధించేలా ఉంది. విడుదలైన నాడే ప్రపంచ వ్యాప్తంగా రూ.150 కోట్లు వసూళ్లు చేసే ఛాన్స్ ఉందని టాక్. అలాగే ఫస్ట్ వీక్ ముగిసే సరికి 400 కోట్లు కలెక్ట్ చేస్తోంది అని అంటున్నారు. మరి ఇది నిజం అయితే, దాదాపు ప్రభాస్ సరికొత్త రికార్డులను క్రియేట్ చేసినట్టే.
Also Read:BJP:తెలంగాణలో కమలం వికసిస్తుందా?