ఒకప్పుడు స్టార్ హీరోలంటే సీనియర్ ఎన్టీఆర్, అక్కినేని, శోభన్ బాబు, కృష్ణంరాజుల పేర్లే గుర్తుకొస్తాయి. అయితే చంద్రమోహన్ వారికి ధీటుగా సినిమాలు చేసేవారు. ఆయనతో సినిమాలు చేయడానికి నిర్మాతలతో పాటు హీరోయిన్లు కూడా ఎక్కువగా ఆసక్తి చూపేవారట. అప్పటివరకు గుర్తింపు లేని దివంగ నటి శ్రీదేవి, జయప్రద, జయసుధ.. చంద్రమోహన్ తో ‘పదహారేళ్ల వయసు’, ‘సిరి సిరిమువ్వలు’, ‘ప్రాణం ఖరీదు’ వంటి సినిమాల్లో నటించి స్టార్స్ అయ్యారు. అందుకే, చంద్రమోహన్ తో నటించాలని ఆ తర్వాత కాలంలో విజయశాంతి లాంటి స్టార్లు కూడా ఆసక్తి చూపించారు.
నిజానికి టాలీవుడ్‌లో చంద్రమోహన్ కి జీవితాన్ని ఇచ్చింది బీఎన్‌రెడ్డి. చంద్రమోహన్ అసలు పేరు మల్లంపల్లి చంద్రశేఖర్‌రావు. చంద్రమోహన్ మద్రాసుకు వెళ్లి సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న క్రమంలో బీఎన్‌రెడ్డి వంటి దర్శకుడి దృష్టిలో పడ్డారు. ఇక ఆయనే చంద్రశేఖర్‌కు చంద్రమోహన్ అని నామకరణం చేశారు. ఇక అప్పటి నుంచి ఆయన చంద్రమోహన్‌గా.. బీఎన్‌రెడ్డి తెరకెక్కించిన ‘రంగుల రాట్నం’ చిత్రంతోనే హీరోగా పరిచయం అయ్యారు.
అలా 1966లో ‘రంగుల రాట్నం’ సినిమాతో తెరంగేట్రం చేసిన ఆయన చాలా దశాబ్దాల పాటు సుదీర్ఘ కెరీర్‌లో 600కిపైగా చిత్రాల్లో నటించి ఎన్నో అద్భుతమైన పాత్రలు పోషించారు. తన 55 ఏళ్ల సినీ కెరీర్‌లో చివరిసారిగా గోపిచంద్ నటించిన ‘ఆక్సిజన్’ చిత్రంలో చంద్రమోహన్ కనిపించారు. అలా ఆయన చివరి సినిమా గోపిచంద్ నటించిన ‘ఆక్సిజన్’ సినిమా కావడం విశేషం.
Also Read:సందీష్ భాటియాతో కేటీఆర్..ప్రోమో అదుర్స్