ఏపీ అసెంబ్లీ లాబీలో ఆసక్తికర చర్చ

2
- Advertisement -

ఏపీ అసెంబ్లీ లాబీలో ఆసక్తికరమైన సరదా సంభాషణ చోటుచేసుకుంది. హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, మంత్రి అనగాన సత్యప్రసాద్, ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి మధ్య వెయిట్ లాస్ అంశంపై చర్చ హాస్యంగా సాగింది.

“బొజ్జల సుధీర్ రెడ్డి వెయిట్ లాస్ అయ్యానంటున్నాడు… తేడా కనిపిస్తుందా?” అంటూ బాలకృష్ణ మంత్రి అనగానిని సరదాగా ప్రశ్నించారు. దానికి వెంటనే స్పందించిన సుధీర్ రెడ్డి, “15 కేజీలకు పైగా తగ్గాను, ఇంకా ఎంత తగ్గమంటారు?” అంటూ నవ్వుతూ సమాధానం ఇచ్చారు.

దానికి బాలయ్య తనదైన శైలిలో, “ఇంకా తగ్గకు… మళ్లీ నాకు పోటీ వస్తావ్!” అంటూ సెటైర్ వేశారు. అక్కడున్నవారు అందరూ నవ్వుల్లో మునిగిపోయారు. ఇదే సమయంలో సుధీర్ రెడ్డి మరో ఆసక్తికర వ్యాఖ్య చేస్తూ, “మిమ్మల్ని, Nara Lokesh గారిని ఒకే ఫ్రేమ్‌లో చూడాలని ప్రజలు అనుకుంటున్నారు” అని బాలకృష్ణతో అన్నారు.

దానికి బాలకృష్ణ హాస్యంగా, “నాకు కొన్ని విషయాలు వినపడవు” అంటూ బదులిచ్చారు. ఈ సరదా సంభాషణ అసెంబ్లీ లాబీలో హాస్య వాతావరణాన్ని సృష్టించింది. రాజకీయాల మధ్య ఇలాంటి స్నేహపూర్వక సంభాషణలు అరుదుగా కనిపిస్తాయని పలువురు అభిప్రాయపడ్డారు.

Also Read:12 ఏళ్ల టీ20 రికార్డు బ్రేక్!

- Advertisement -