జమున లైఫ్ లోని ఇంట్రెస్టింగ్ విషయాలు

98
- Advertisement -

అలనాటి సీనియర్ నటి జమున కర్ణాటకలోని హంపీలో జన్మించారు. ఆమె పేరెంట్స్ కులాంతర వివాహం చేసుకున్నారు. తండ్రి వ్యాపారవేత్త కావడంతో ఆమె 7 సం.ల వయసులో ఉన్నప్పుడే గుంటూరు జిల్లా దుగ్గిరాలకు వలస వచ్చారు. ఓసారి మహానటి సావిత్రి డ్రామాలు వేసే సమయంలో దుగ్గిరాలకు రాగా .. అక్కడున్న జమునను చూశారు. ఆ తర్వాత సావిత్రి జమునను సినిమాల్లోకి ఆహ్వానించగా.. 15 ఏళ్ల వయసులోనే జమున సినీ జీవితంలోకి ఎంట్రీ ఇచ్చింది.

15 ఏళ్లకే జమున సినీ జీవితంలోకి ఎంట్రీ ఇవ్వడంతో ఆమెకు సినిమా వాతావరణం మొదట్లో అలవాటు పడలేదు. దాంతో జమున తనకు నచ్చినట్టు ఉండేవారు. ఈ క్రమంలోనే జమున వ్యవహార శైలి నచ్చలేదని ఏఎన్నార్, సీనియర్ ఎన్టీఆర్ ఇద్దరూ ఆమెతో నటించబోమని చెప్పారు. జమున షూటింగ్ కు లేటుగా వస్తోందని, పొగరుబోతని, కాలు మీద కాలువేసుకొని కూర్చుంటోందని, పెద్దలని గౌరవించడం లేదని ఆరోపణలు చేశారు. కొందరు నటులు వారికి క్షమాపణ చెప్పాలని ఆమెకు సూచించారు.

కానీ జమున నేను చేయని తప్పుకు ఎందుకు క్షమాపణ చెప్పాలని ప్రశ్నించారు. కాగా, నిర్మాత చక్రపాణి చొరవతో ఆ తర్వాత వారి మధ్య అనుబంధం కుదిరింది. ఇక జమున ప్రేమ కథ విషయానికి వస్తే.. సినీ ఇండస్ట్రీలోకి వచ్చిన కొన్నాళ్లకే యాక్టర్ హరినాథ్ తో జమున ప్రేమలో పడ్డారట. పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారని అప్పట్లో ఇండస్ట్రీలో టాక్ ఉండేది. కానీ, తనని పెళ్లి చేసుకుంటే ఇబ్బందులు వస్తాయని ఎస్వియార్ జమున ను ముందే హెచ్చరించారు. అలా జమున ప్రేమ పెళ్లిని క్యాన్సల్ చేసుకుంది. ఆ రోజు ఎస్వీయార్ చెప్పిన మాటలను ఎప్పుడు ఆమె గుర్తు చేసుకునేవారు.

ఇవి కూడా చదవండి..

- Advertisement -