మోదీ ప్రధాని అయిన తర్వాత ప్రపంచానికి భారత్ ఇచ్చిన అద్భుతమైన బహుమతి యోగా అన్నారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో యోగా డే…. సందర్భంగా వన్ డే కౌంట్ డౌన్ యోగా కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా మాట్లాడిన కిషన్ రెడ్డి… 200 దేశాలు మన భారతీయ సంస్కృతి అయిన యోగాను గుర్తించడం గర్వించాల్సిన విషయం అన్నారు. యోగాను ప్రపంచానికి పరిచయం చేసిన ప్రధాని మోదీకి కృతజ్ఞతలు చెప్పారు. ప్రతి వ్యక్తి జీవితంలో యోగా భాగం కావాలి… యోగా వల్ల మానసిక, శారీరక ఆరోగ్యం లభిస్తుంది అన్నారు.
ప్రపంచ ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలన్నదే మన లక్ష్యం అని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. యోగా అంతిమ లక్ష్యం మానవత్వం సాధించడం.. ఆది యోగి పతంజలి మహర్షి యోగ సూత్రాలు సర్వకాలాలకు ఆచరణీయం అన్నారు. యోగా అంటే మనస్సు, వృత్తి, ప్రవృత్తులను నిగ్రహించడం, ఇది చాలా ముఖ్యం అన్నారు.
Also Read:‘కుబేర’ …డిఫరెంట్ మూవీ!

