మహిళా పార్లమెంటేరియన్ల సదస్సులో పాల్గొనేందుకు టీఆర్‌ఎస్ ఎంపీ కవిత లండన్ పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. ఈ నెల మార్చ్ 11 న లండన్ లో తెలంగాణ అసోసియేషన్ అఫ్ యునైటెడ్ కింగ్డమ్ సంస్థ (టాక్ ) నిర్వహించనున్న అంతర్జాతీయ మహిళా దినోత్సవ పోస్టర్‌ను సోమవారం నిజామాబాద్ పార్లమెంట్ సభ్యురాలు శ్రీమతి కల్వకుంట్ల కవిత గారు ఆవిష్కరించారు. అనంతరం సంస్థ అధ్యక్షురాలు పవిత్ర రెడ్డి కంది కవిత ను శాలువా తో సన్మానించారు.
“తెలంగాణ చరిత్ర – మహిళలు” అనే ఆలోచన తో మహిళా దినోత్సవం జరుపుకుంటున్నామని, మన తెలంగాణ చరిత్ర లో ఎంతో మంది వీర వనితలున్నారని, సమైక్య రాష్ట్రం లో వారికి తగిన గుర్తింపు గౌరవం దక్కలేదని, టాక్ సంస్థ వీలైనంత వరకు, వాటి పరిరక్షణకు కృషి చేస్తుందని, మహిళా దినోత్సవం సందర్భంగా తెలంగాణకు చెందిన వివిధ రంగాలలో మహిళల జీవిత విశేషాలతో కూడిన ఫోటో ఎక్సిబిషన్ ను ఏర్పాటు చేస్తున్నట్టు అధ్యక్షురాలు పవిత్ర కంది తెలిపారు.
ఈ సందర్భంగా ఎంపీ కవిత మాట్లాడుతూ మహిళా దినోత్సవం జరుపడం ఏంతో సంతోషంగా వుందని , ముఖ్యంగా “తెలంగాణ చరిత్ర – మహిళలు” అనే ఎంతో గొప్ప ఆలోచన తో వెళ్లడం ఎంతో మందికి స్ఫూర్తిదాయకమని, కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న తెలంగాణ అసోసియేషన్ అఫ్ యునైటెడ్ కింగ్డమ్ సంస్థ (టాక్ ) సభ్యులని అభినందించారు.
టాక్ సంస్థకు తన సహాయ సహాకారాలు ఎల్లప్పుడూ వుంటాయని చెప్పారు . మరియు మహి ళలు అన్ని రంగాల్లోనూ రాణించాలనీ , మహిళాభ్యున్నతితో దేశాభివృద్ధి సాధ్యమని, మహిళలు అన్నిరంగాల్లోనూ పురుషులకు ధీటుగా రాణిస్తున్నారని, సమాజంలో పురుషులతో పాటు స్త్రీలకు సమాన హక్కులు కల్పించినప్పుడే నిజమైన సమాజఅభివృద్ధి సాధ్యమని ఆమె అన్నారు. టాక్ సంస్థ ఒక మహిళా నాయకురాలి అధ్యక్షతన ముందుకు వెళ్లడం చాలా సంతోషంగా ఉందని ప్రశంశించారు.
“తెలంగాణ చరిత్ర – మహిళలు” అనే ఆలోచనను ప్రోత్సహించి అభినందించిన కవిత గారికి, అలాగే సమాచార సేకరణలో సహాయం చేస్తున్నటువంటి కవి నందిని సిద్ద రెడ్డి గారికి, సంపాదకులు కట్ట శేఖర్ గారికి టాక్ మహిళా సభ్యురాలు స్వాతి బుడగం కృతఙ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టాక్ అధ్యక్షురాలు పవిత్ర కంది తో పాటు మహిళా ప్రతినిధులు స్వాతి బుడగం, సుమా విక్రమ్, విజయ లక్ష్మి, శ్రీ శ్రావ్య, అపర్ణ మరియు ఇతర ప్రవాస మిత్రులు నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.