టీ అంటే ఇష్టపడనివారుండరు. టీ లేనిదే చాలా మందికి రోజు మొదలవుదు, రోజు గడవదు. ఉదయం టీ, సాయంత్రం టీ, బంధువుల వస్తే టీ, పనిముగించుకుని ఇంటికి వస్తే టీ.. ఇలా టీ తో ఎనలేని బంధం ముడిపడి ఉంది. ఇక ఇవాళ అంతర్జాతీయ టీ దినోత్సవం. ప్రస్తుతం ఉన్న సమాజంలో చాలా మందికి టీ లేదా కాఫీ తాగే అలవాటు అధికంగా ఉంటుంది. ప్రపంచంలో నీళ్ళ తరువాత అత్యాదిక మంది తాగే పానీయం టీ లేదా కాఫీ. ఇక వీటిలో చాలా రకాలే ఉన్నాయి. అల్లం టీ, లెమెన్ టీ, మసాలా టీ, తులసి టీ, కర్దోమోన్ టీ, గ్రీన్ టీ, ఇరానీ టీ, వంటి రకరకాల పేర్లతో అందుబాటులో ఉంది.
మే 21న ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ టీ దినోత్సవాన్ని జరుపుకుంటారు. గతంలో డిసెంబర్ 15న టీ డేని జరుపుకునేవారు. తర్వాత దానిని మే 21న జరుపుకోవడం ప్రారంభించారు..ఐక్యరాజ్యసమితి ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ద్వారా అంతర్జాతీయ టీ దినోత్సవాన్ని అధికారికంగా జరుపుకోవాలనే ప్రతిపాదన ఉంచారు. ఆ తర్వాత
2020 మే 21న మొదటిసారిగా అంతర్జాతీయ టీ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు.
Also Read:Ram Charan: ది గ్రేట్ లెజెండ్ ఎన్టీఆర్..
రోగనిరోధక శక్తి పెంచే టీ గురించి మనం ఎక్కడ తెలుసుకుందాం .టీ వల, టీ కౌన్సిల్ ఆఫ్ USA రోగనిరోధక శక్తిని పెంచడానికి గ్రీన్ టీ తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలను గురించి వెల్లడించింది. సంతోషమైనా, ఉత్సాహమైనా, అలసిపోయినా సందర్భం ఏదైనా బెస్ట్ ఫ్రెండ్ టీ. యాంటీ ఆక్సిడెంట్లు , యాంటీ ఇన్‌ఫ్లమేటరీ పదార్థాల సంపూర్ణ మిశ్రం టీ. హల్దీ టీ రోగనిరోధక శక్తిని పెంచి, కాలేయాన్ని శుభ్రపరిస్తే.. తేనె నిమ్మకాయ అల్లం దట్టించిన టీ గొంతు నొప్పి , జలుబుకు చక్కటి చిట్కా. అలాగే హనీ లెమన్ జింజర్ టీ, ఆమ్లా అల్లం టీ ద్వారా విటమిన్ సీ దొరుకుతుంది. దీంతో బరువు తగ్గించుకోవచ్చు. డిటాక్స్ డైట్‌లో అల్లం అజ్వైన్ లెమన్ టీ, జింజర్ అజ్వైన్ లెమన్ టీ చేర్చుకుంటే బరువు తగ్గే ప్రక్రియ వేగవంతమవుతుందని నిపుణులు కూడా నమ్ముతున్నారు.
Also Read:ఇవి పాటిస్తే మీ ఆరోగ్యం పదిలం