రంగారెడ్డి జిల్లా ,మొయినాబాద్ మండలం ,గండిపేట పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్లో 25-04-2022 న ” పాఠశాల ఆవరణలోని స్విమ్మింగ్ పూల్ను ప్రారంభించి బంగారు కిరీటానికి మరో ముత్యం చేర్చారు.
80 అడుగుల x 45 అడుగుల స్విమ్మింగ్ పూల్నువరలక్ష్మి శరత్ కుమార్ (ఇండియన్ యాక్ట్రెస్ ) మరియు శ్యామల గోలి (ఇండియన్ స్విమ్మర్) , పాఠశాల చైర్మన్ మల్క . కొమరయ్య గారు , సి . ఓ . ఓ మల్క యశస్వి గారు , జోహార్ ఆరిఫ్ (వి . ఐ . ఫ్ ఎడ్యుకేషన్ సొసైటీ జాయింట్ సెక్రటరీ) ,పాఠశాల ప్రిన్సిపాల్ మిథాలీ అర్చిట్ గారు ప్రారంభించారు.
శ్రీమతి శ్యామల గోలి అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన స్విమ్మింగ్ సౌకర్యాలు కల్పిస్తున్న యాజమాన్యాన్ని అభినందించారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో శ్రీమతి మీటాలి అర్చిత్ ప్రిన్సిపాల్ మాట్లాడుతూ పాఠశాల విద్యార్థులకు తరగతి గదులు, లైబ్రరీలు, క్రీడా మైదానాలు మొదలైన వాటిలో ఉత్తమమైన మౌలిక సదుపాయాలను అందించడానికి పాఠశాల ఎల్లప్పుడూ కట్టుబడి ఉందని అన్నారు. వర్ధమాన స్విమ్మర్లకు కోచింగ్ ఇవ్వనున్న స్విమ్మింగ్ కోచ్ శ్రీ ప్రణీత్ ఆధ్వర్యంలో విద్యార్థులు తొలిరోజు పూల్లోకి దిగారు.పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్ గండిపేట ప్రయాణంలో కొత్త అధ్యాయానికి గుర్తుగా ఈ వేడుక ఘనంగా జరిగింది.