ఇంటర్నేషనల్ నర్స్ డే సందర్భంగా గ్రీన్ ఛాలెంజ్ హరితసేన లో భాగంలో చందానగర్ లోని మెడికవర్ హాస్పిటల్ ఆవరణలో మొక్కలు నాటారు నర్సులు. ఈ సందర్భంగా విజయ , వైష్ణవి మాట్లాడుతూ ఇంటర్నేషనల్ నర్స్ డే సందర్బంగా మాజీ రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ హరితసేన లో భాగంలో మొక్కలు నాటడం చాలా ఆనందంగా ఉంది అన్నారు.

ప్రతీ ఒక్కరు మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. రోగాలు తగ్గాలి మంచి ఆక్సీజన్ అందాలి అంటే ప్రతీ ఒక్కరు మొక్కలు నాటే బాధ్యత చేపట్టాలి అన్నారు. మనుషులకే కాక సకల జీవ రాశులకు మొక్కలు నీడను, పండ్లను, పూలను ఇస్తున్నాయి వీటి మీద ఆధారపడి బ్రతికే జీవ జాతులు ఎన్నో ఉన్నాయి అన్నారు. ఇంతటి గొప్ప కార్యక్రమం ప్రారంభించిన జోగినపల్లి సంతోష్ కుమార్ గారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమం లో హరితసేన రాష్ట కోర్డినేటర్ గర్రెపల్లి సతీష్ మరియు హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు.
Also Read:Pawan:నర్సుల సేవలు ప్రశంసనీయం

