నేటి నుండి విదేశాలకు విమానసేవలు…

183
international flights
- Advertisement -

కరోనా ఎఫెక్ట్ తో (మార్చి 23, 2020) నుంచి నిలిచిపోయిన విదేశీ విమాన సేవలు నేటినుండి తిరిగి ప్రారంభంకానున్నాయి. ముందుగా అమెరికా, ఫ్రాన్స్, జర్మనీ దేశాలకు విమానాలను నడపనున్నారు. వివిధ దేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు కరోనా పాజిటివ్ లేని వారికి, వారి హెల్త్ చెక్ అప్ చేసిన తర్వాత మాత్రమే ప్రయాణాలకు అనుమతించనున్నారు అధికారులు.

యునైటెడ్ ఎయిర్ లైన్స్ 18 విమానాలను నేటి నుంచి జులై 31 వరకు నడపనుంది . ఈ విమాన సేవలు ఢిల్లీ, ముంబై, బెంగళూరు మధ్య నడపనున్నారు. జులై 19 నుంచి ఎయిర్ ఫ్రాన్స్ విమానయాన సంస్థ… ఢిల్లీ, ముంబై, బెంగళూరుకు 25 విమానాలను నడపనుంది. జర్మనీతో కూడా చర్చలు ఫైనల్ స్టేజీలో ఉన్నాయి. జర్మనీ లుక్సానా ఎయిర్ లైన్స్ తో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ ఎయిర్ లైన్స్ కూడా ఢిల్లీ, ముంబై, బెంగళూరు, హైదరాబాద్ లకు విమానాలను నడపనుంది.

కరోనా తీవ్రత మళ్లీ పెరిగితే విమాన సేవలను నిలిపివేసే అవకాశం ఉంది. వందేభారత్ మిషన్ లో భాగంగా 2 లక్షల 8 వేల భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చినట్లుగా వెల్లడించారు. అలాగే 85 వేల 289 మందిని ఆయా దేశాలకు పంపించినట్లు పౌర విమానయాన శాఖ వెల్లడించింది.

- Advertisement -