ప్రజల కోసం అగ్నిమాపక సిబ్బంది చేసిన త్యాగాలను గుర్తించి వారిని గౌరవించడం కోసం ప్రతి ఏటా మే4న అంతర్జాతీయ అగ్నిమాపక దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా అగ్ని ప్రమాదాలపై ప్రజలకు అవగాహన కల్పించనున్నారు.
1999 ఆస్ట్రేలియా లో ఒక అగ్నిప్రమాదంలో అసువులు బాసిన అగ్నిమాపక సిబ్బంది గుర్తుగా ఈ రోజు అంతర్జాతీయ అగ్నిమాపక దినోత్సవం జరుపుకుంటారు..గతంలో ముంబై డాక్ యార్డులో జరిగిన ప్రమాదంలో 66 మంది ప్రాణాలు కోల్పోయారు, ముంబై నగరం కొంతభాగం దెబ్బ తిన్నది అప్పుడు ఆశువులు బాసిన వారి జ్ఞాపకార్థమే ఏప్రిల్ లో జరిగే జాతీయ అగ్నిమాపక వారోత్సవాలు.
Also Read:కర్ణాటక తొలి ముఖ్యమంత్రి.. కేసీ రెడ్డి
డ్యూటీలో అమరులైనా లేదా మనందరి భద్రతను కాపాడేందుకు తమ జీవితాలను అంకితం చేసిన అగ్నిమాపక సిబ్బందిని గుర్తుంచుకోవడం మనందని బాధ్యత.నీలం మరియు ఎరుపు రంగు రిబ్బన్‌లను సగర్వంగా ధరించడం ద్వారా అగ్నిమాపక సిబ్బందికి కృతజ్ఞతలు చెబుతున్నారు.
Also Read:బంగాళాఖాతంలో తుపాను..భారీ వర్ష సూచన