పవన్ – రానా మూవీకి అదిరిపోయే టైటిల్..!

133
Pawan-Rana Remake
- Advertisement -

ప‌వర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌స్తుతం అయ్య‌ప్ప‌నుమ్ కోషియ‌మ్ రీమేక్‌లో నటిస్తున్నాడు. ఇందులో రానా దగ్గుబాటి కూడా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం కొంతవరకూ షూటింగు జరిగిన తరువాత కరోనా పెరగడంతో షూటింగును ఆపేశారు. మళ్లీ ఇప్పుడు కరోనా ప్రభావం తగ్గుతుండడంతో, ఈ నెల 11వ తేదీ నుంచి సెట్స్ పైకి వెళ్లడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి ఇంతవరకూ టైటిల్‌ను ఖరారు చేయలేదు.

తాజాగా ఈ సినిమాకి ఒక టైటిల్ ను పరిశీలిస్తునట్టుగా ఒక వార్త షికారు చేస్తోంది. ఈ చిత్రానికి ‘పరశురామ కృష్ణమూర్తి’ అనే సాలిడ్ టైటిల్‌ను కన్ఫర్మ్ చేసినట్టు తెలుస్తుంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావ‌ల‌సి ఉంది. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా సితార ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు. త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ మాట‌లు అందిస్తున్నారు. ఈ సినిమాలో నిత్యామీనన్, ఐశ్వర్య రాజేశ్ కథానాయికలుగా కనిపించనున్నారు.

- Advertisement -