తెలంగాణలో ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఫలితాల వెల్లడి తేదీని అధికారులు ఖరారు చేశారు. జులై 14న ఫలితాలను వెల్లడించనున్నట్లు టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ట్విట్టర్ ద్వారా తెలిపారు. ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలపై ఓ విద్యార్థి తల్లి కేటీఆర్‌కు ట్వీట్ చేయగా ఆయన స్పందించారు.
ఇంటర్ ఫలితాల వెల్లడిపై విద్యాశాఖ మంత్రి, ఇంటర్ కార్యదర్శితో మాట్లాడతానని ట్వీట్ చేశారు కేటీఆర్. కాసేపటి తర్వాత మరో ట్వీట్ చేసిన కేటీఆర్.. జూలై 14న ఫలితాలు విడుదలచేయనున్నట్లు,విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్ రెడ్డి ఇందాకే తెలిపారని స్పష్టం చేశారు. దీంతో జులై 14న ఫలితాలను వెల్లడించడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
జులై 15లోపు ఇంటర్ సర్టిఫికేట్లను సమర్పించాలన్నా నిబంధన ఉండటం,తెలంగాణ విద్యార్థులకు ఐఐటీలు, ఎన్ఐటీలు, ట్రిపుల్ ఐటీలు సీట్లు కేటాయించాయి. అయితే సప్లిమెంటరీ ఫలితాలు రాకపోవడంతో విద్యార్థుల్లో ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలోనే ఓ విద్యార్థి తల్లి చేసిన ట్వీట్‌కు స్పందించారు కేటీఆర్.
Education secretary Janardhan Reddy Garu just informed that the results will be announced on 14th, July
— KTR (@KTRTRS) July 12, 2019