తెలంగాణ లో మార్చ్ 5 నుండి 25 వరకు ఇంటర్మీడియట్ పరీక్షలు జరుగుతాయని ఇంటర్ బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య తెలిపారు. నాంపల్లి ఇంటర్ బోర్డు కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన కృష్ణ ఆదిత్య.. ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరుగుతాయని తెలిపారు.
రాష్ట్రవ్యాప్తంగా 1532 పరీక్ష కేంద్రాలు ఉండగా విద్యార్థులు 8.45 కి పరీక్ష కేంద్రానికి చేరుకోవాలి అన్నారు. పరీక్ష కేంద్రాలకు 8.45 వరకు చేరుకుంటే ఇబ్బంది ఉండదు అనేది మా సూచన అన్నారు. 5 నిమిషాల గ్రెస్ పీరియడ్ ఇస్తాం కానీ ఆ అవకాశం రాకుండా విద్యార్థులు చూసుకోవాలి అన్నారు. ముందుగా వస్తే విద్యార్థులకు సేఫ్..ముందుగా వస్తే ఇబ్బంది ఉండదని టైం ఉంది..ముందుగా వస్తే omr షీట్ ఫీల్ చేసుకొనే అవకాశం ఉంటుందన్నారు.
ప్రథమ సంవత్సరం, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 9 లక్షల 96 వేల 971 మంది పరీక్ష రాయనున్నారు. పరీక్ష పర్యవేక్షకులు చీఫ్ సూపరింటెండెంట్స్ 1532,డిపార్ట్మెంట్ ఆఫీసర్లు 1532,ఇన్విజిలేటర్లు 29 వేల 992,ఫ్లయింగ్ స్క్వాడ్ 72 మంది,సిట్టింగ్ స్క్వాడ్ 124 మంది ఉన్నారని తెలిపారు. నాంపల్లి ఇంటర్ బోర్డ్ లో కమాండ్ కంట్రోల్ ఏర్పాటు చేశామని.. 1532 సెంటర్లను సిసి కెమెరాల ద్వారా పర్యవేక్షణ జరుగుతుందన్నారు.
Also Read:కర్తవ్యాన్ని మరిచింది ఎవరు?:సీఎంపై హరీశ్ ఫైర్
పరీక్ష కేంద్రంలోకి ఎలాంటి ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలకు అనుమతి లేదు అని వాచ్ కూడా అనుమతి ఉండదు అన్నారు. ప్రశ్న పత్రాలు పోలీస్ ఎస్కార్ట్ తో సెంటర్ కి చేరుతాయి..జిల్లాలో కలెక్టర్, ఎస్పీ అందరి తో మీటింగ్ జరిగింది..పరీక్ష కేంద్రంలో సెంటర్ ని బట్టి 5 నుండి 6 సిసి కెమెరాలు ఉంటాయి..పరీక్ష సమయంలో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేశాం..పరీక్ష కేంద్రాల పరిదిలో 144 సెక్షన్ అమల్లో ఉంటుందన్నారు.
హాల్ టికెట్ మీద లొకేషన్ క్యూ ఆర్ కోడ్ ఉంటుంది ముందు రోజే ఎగ్జామ్ సెంటర్ చూసుకుంటే విద్యార్థులకు ఇబ్బంది ఉండదు..స్ట్రాంగ్ రూమ్ కి మెటీరియల్ పంపించాము..Tgpsc గైడ్ లైన్స్ ప్రకారం పరీక్షలు నిర్వహిసున్నామని చెప్పారు.

