రివ్యూ: ఇంటిలిజెంట్

306
Intelligent Movie Review
- Advertisement -

మెగా ఫ్యామిలీ నుంచి హీరోగా ఆరంగేట్రం చేసిన హీరో సాయి ధరమ్ తేజ్. కెరీర్ ప్రారంభంలో వరుస విజయాలను సొంతం చేసుకున్న తేజ్‌…తర్వాత కాస్త డిలా పడ్డాడు. కొంతకాలంగా సక్సెస్‌ రుచి చూడని తేజ్‌..ఈ సారి ఎలాగైన హిట్ కొట్టేందుకు క‌మ‌ర్షియ‌ల్ చిత్రాల ద‌ర్శ‌కుడు వి.వి.వినాయ‌క్‌పై భారీ ఆశలు పెట్టుకున్నాడు. మరీ వినాయక్‌పై తేజు పెట్టుకున్న ఆశలు నిజమయ్యాయా..?ఇంటిలిజెంట్‌తో తేజు హిట్ కొట్టాడా లేదా చూద్దాం…

కథ:

తేజు(సాయిధరమ్ తేజ్)కి చిన్నప్పటి నుంచి ప్రాక్టికల్‌గా ఉండడం అలవాటు. ఎవరికైనా మంచి చేస్తే మనకు మంచి జరుగుతుందని నమ్మే వ్యక్తి నందకిషోర్(నాజర్)ని గురువుగా భావిస్తుంటాడు. నందకిషోర్ కంపెనీలోనే సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా చేరతాడు. నందకిషోర్ కూతురు సంధ్య(లావణ్య త్రిపాఠి), తేజు ప్రేమించుకుంటారు. సీన్ కట్ చేస్తే మాఫియా డాన్ విక్కీభాయ్(రాహుల్ దేవ్) వీరి జీవితంలోకి ప్రవేశిస్తాడు. ఈ నందకిషోర్‌ను చంపేసి ఆత్మహత్యగా క్రియేట్ చేసి కంపెనీని విక్కీభాయ్ సొంతం చేసుకుంటాడు. ఆ తర్వాత ఏం జరుగుతుంది..? తన గురువును చంపిన విక్కీభాయ్ మీద తేజు ఎలా పగ తీర్చుకున్నాడు..? అన్నదే ఇంటిలిజెంట్ కథ.

ప్లస్ పాయింట్స్:

సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్స్ తేజు డాన్స్‌, సినిమాటోగ్ర‌ఫీ,నిర్మాణ విలువ‌లు. సాయిధ‌ర‌మ్ తేజ్ త‌న‌దైన ఎన‌ర్జిటిక్ డాన్స్‌, యాక్ష‌న్ పార్ట్‌తో ప్రేక్ష‌కుల‌ను మెప్పించాడు. హీరోయిన్ లావ‌ణ్య త్రిపాఠి గ్లామ‌ర్ సినిమాకు మరింత ప్లస్‌గా మారింది. ఇక సినిమాలో కీల‌క‌పాత్ర‌లో న‌టించిన నాజ‌ర్ త‌న పాత్ర‌కు న్యాయం చేశారు. మిగితా పాత్రల్లో కాశీ విశ్వ‌నాథ్‌, బ్ర‌హ్మానందం, షాయాజీ షిండే పర్వాలేదనిపించారు.

Intelligent Movie Review

మైనస్ పాయింట్స్:

సినిమాకు మేజర్ మైనస్ పాయింట్స్ కథ,కథనం. వినాయక్ గత సినిమాల్లో కనిపించే బలమైన సన్నివేశాలు, ఉత్కంఠ రేకెత్తించే అంశాలు ఇందులో లేవు. హీరో పరిచయం కానీ, ఇంటర్వల్ సీన్ కానీ ఏదీ ఆకట్టుకోదు. మాస్ ఆడియన్స్‌ను అలరించే అంశాలు పెద్దగా లేవు.

సాంకేతిక విభాగం:

సాంకేతికంగా సినిమాకు మంచిమార్కులే పడతాయి. సి.కల్యాణ్ నిర్మాణ విలువలకు వంకపెట్టలేం. త‌మ‌న్ ట్యూన్స్ వినసొంపుగా లేవు. నేప‌థ్య సంగీతం ప‌రావాలేదు. విశ్వేశ్వ‌ర్ సినిమాటోగ్ర‌ఫీ చాలా బావుంది. ప్రతి సీన్ ఎంతో రిచ్‌గా ఉంది. ఎడిటింగ్ పర్వాలేదనిపిస్తుంది.

తీర్పు:

సాఫ్ట్‌వేర్ కంపెనీను దక్కించుకోవాలని చూసే మాఫియా డాన్, అతడిని అంతం చేసి కంపెనీని కాపాడడం కోసం హీరో చేసే ఫీట్లు ఇంటిలిజెంట్ మూవీ. సాయి ధరమ్ తేజ్ నటన,సినిమాటోగ్రఫీ ప్లస్ పాయింట్స్ కాగా రోటిన్ కథ,కథనం మైనస్ పాయింట్స్. ఓవరాల్‌గా రొటీన్ క‌మ‌ర్షియ‌ల్ ఎలిమెంట్స్‌తో పర్వాలేదనిపించే మూవీ ఇంటిలిజెంట్.

విడుదల తేదీ: 09/02/2018
రేటింగ్:2.25/5
నటీనటులు: సాయిధరమ్‌తేజ్‌, లావణ్య త్రిపాఠి
సంగీతం:తమన్‌
నిర్మాత: సి.కళ్యాణ్‌
దర్శకత్వం: వి.వి.వినాయక్

- Advertisement -