TTD:తిరుప‌తిలో ఇంటిగ్రేటెడ్‌ టౌన్‌షిప్

6
- Advertisement -

టీటీడీ ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి అధ్య‌క్షులు బీఆర్ నాయుడు అధ్యక్ష‌త‌న తిరుమ‌ల అన్న‌మ‌య్య భ‌వ‌నంలో ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి స‌మావేశం జ‌రిగింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

• టిటిడి ఆలయాలకు ధ్వజస్తంభం, రథాలు తయారు చేసేందుకు ప‌ల‌మ‌నేరులో 100 ఎకరాలలో దివ్య వృక్షాలు పెంచేందుకు నిర్ణయం.

• తిరుపతిలోని శ్రీ పద్మావతి చిన్నపిల్లల హృదయాలయంలో అత్యాధునిక సౌకర్యాలు కల్పించేందుకు అదనంగా రూ.48 కోట్లు మంజూరుకు ఆమోదం.

• టీటీడీ బోర్డు ఎడ్యుకేషన్ స‌బ్ క‌మిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా టీటీడీలోని 31 విద్యా సంస్థల్లో డిజిటల్‌ క్లాస్‌ రూమ్‌లు, సీసీ కెమెరాలు, కంప్యూటర్లు, అందుకు అవసరమైన సాఫ్ట్‌వేర్‌లు, అవసరమైన సిబ్బంది, తదితర సౌకర్యాలను కల్పించేందుకు ఆమోదం.

• ముంబైలోని బాంద్రా ప్రాంతంలో రూ.14.40 కోట్లతో శ్రీవారి ఆలయం నిర్మాణానికి ఆమోదం.

• భ‌క్తుల సౌక‌ర్యార్థం తిరుప‌తిలోని 20 ఎక‌రాల‌లో ఇంటిగ్రేటెడ్‌ టౌన్‌షిప్ నిర్మాణానికి ప్లానింగ్ కొర‌కు, ఆర్కిటిక్ట్ నియామ‌కానికి ఆమోదం.

– దాత‌ల కాటేజీల నిర్వ‌హ‌ణ‌, నిర్మాణాల‌పై నూత‌న స‌మ‌గ్ర విధానం తీసుకురావాల‌ని నిర్ణ‌యం.

• తిరుపతి జిల్లా తలకోనలోని శ్రీ సిద్దేశ్వర స్వామివారి ఆలయ పునః నిర్మాణ ప‌నుల‌లో భాగంగా రెండ‌వ ద‌శ‌లో రూ.14.10 కోట్లు మంజూరు. (మొద‌టి ద‌శ‌లో ఇదివరకే రూ.4 కోట్లు మంజూరు)

– తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా డిగ్రీ కళాశాలలో ప్రస్తుతం ఉన్న 2100 హాస్టల్‌ సీట్లకు అదనంగా మరో 270 హాస్టల్‌ సీట్లు పెంచాలని నిర్ణయం.

• టిటిడి ఇంజనీరింగ్‌ విభాగంలో నాలుగు కేటగిరిలలో ఖాళీగా ఉన్న 60 పోస్టులకు ఇప్పటికే ఇచ్చిన నోటిఫికేషన్‌ ఆధారంగా త్వరలో భర్తీ చేసేందుకు నిర్ణయం.

• తిరుపతిలో టీటీడీ నిర్వహిస్తున్న రోడ్ల నిర్వహణ, మరమ్మతులు, వీధి దీపాల నిర్వహణ కొనసాగించాలని నిర్ణయం.

• శ్రీవారి పోటులో నిబంధనల మేరకు నూతనంగా 18 పోటు సూపర్‌వైజర్‌ (పాచక) పోస్టులు ఏర్పాటుకు ప్రభుత్వానికి నివేదించాలని నిర్ణయం.

• తిరుమలలోని రహదారులు, ప్రధాన కూడళ్ళ పేర్లను వైష్ణవ పురాణాలు, ఆళ్వార్లు, అన్నమాచార్య సంకీర్తనలలోని శ్రీవారి నామాలు, తదితర పేర్లతో మార్చేందుకు కమిటీ ఏర్పాటు చేశాం. ఈ కమిటీలో జాతీయ సంస్తృత విశ్వవిద్యాలయం దూర విద్యా కేంద్రం డైరెక్టర్‌ డా. చక్రవర్తి రంగనాథన్‌, అన్నమాచార్య ప్రాజెక్టు ప్రత్యేక అధికారి డా.మేడసాని మోహన్‌, పురాణ ఇతిహాస ప్రాజెక్టు ప్రత్యేక అధికారి డా.డి.ప్రభాకర్‌ కృషమూర్తిలతో కమిటీ ఏర్పాటు చేశాం.

• శ్రీ‌వారి ఆల‌యంలో ఒక ప్ర‌ధాన స‌న్నిధి యాద‌వ‌తో పాటు అద‌నంగా మ‌రో స‌న్నిధి యాద‌వ పోస్టుల ఏర్పాటు, నిబంధ‌న‌ల ప్ర‌కారం భ‌ర్తీకి ఆమోదం.

– తిరుమ‌ల‌లోను, కాలిబాట‌లో ఉన్న పురాత‌న ప్రాశ‌స్త్యం గ‌ల నిర్మాణాల ప‌రిర‌క్ష‌ణ కొర‌కు ప్ర‌త్యేకంగా ఒక విభాగం ఏర్పాటు చేసి, అనుభ‌వం గ‌ల‌ అధికారుల‌ నియామ‌కానికి ఆమోదం.

• రాష్ట్ర ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో అమలులో ఉన్న మధ్యాహ్న భోజన పథకం తరహాలో టీటీడీ ఎస్వీ జూనియర్‌ కళాశాల, ఎస్పీడబ్ల్యూ జూనియర్‌ కళాశాలలో డేస్కాలర్‌లకు మధ్యాహ్న భోజనం అందించాలని నిర్ణయం.

• జగిత్యాల జిల్లా కొండగట్టులోని శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయంలో భక్తుల సౌకర్యార్థం వసతి సముదాయం నిర్మాణానికి నిర్ణయం.

Also Read:వాట్సాప్ డేటా సేకరణ..అనుమతి తప్పనిసరి!

• టీటీడీ అనుబంధ ఆలయాలలో ప‌ని చేస్తున్న‌ 62 మంది అర్చక, పరిచారక, పోటు వర్కర్లు, ప్రసాదం డిస్ట్రిబ్యూట‌ర్లకు వేతనాలు పెంచాలని నిర్ణయం. ఇందులో

అర్చకులకు రూ.25,000/- నుండి 45,000/-

పరిచారకులకు రూ.23,140/- నుండి 30,000/-

పోటువర్కర్లకు రూ.24,279/- నుండి 30,000/-

ప్రసాదం డిస్ట్రిబ్యూట‌ర్లకు రూ.23,640/- నుండి 30,000/-కు పెంచడమైనది.

- Advertisement -