దుబ్బాకకు ఇంటిగ్రేటెడ్ మార్కెట్ మంజూరు..

536
kcr
- Advertisement -

గజ్వెల్ పర్యటనలో భాగంగా ఈ సీఎం కేసీఆర్‌ సిద్ధిపేట జిల్లాలో దుబ్బాకకు ఇంటిగ్రేటెడ్ మార్కెట్‌ను మంజూరు చేశారు. ఈ సందర్భంగా మార్కెట్‌ కోసం దుబ్బాకలో అనువైన స్థల సేకరణ చేయాలని దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి, జిల్లా కలెక్టర్ వెంకట్రామిరెడ్డికి కేసీఆర్ సూచించారు.

గజ్వెల్ పర్యటనలో భాగంగా ఎమ్మెల్యే రామలింగారెడ్డితో దుబ్బాక అభివృద్ధిపై ఆరా తీశారు ముఖ్యమంత్రి. అలాగే స్కూల్ భావన నిర్మాణంపై అడిగి తెలుసుకున్నారు. త్వరలోనే దుబ్బాకకు వస్తానని ఎమ్మెల్యే రామలింగారెడ్డికి సీఎం తెలిపారు. అనంతరం దుబ్బాకకు ఇంటిగ్రేటెడ్ మార్కెట్‌ను మంజూరు చేసినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఎమ్మెల్యే రామలింగారెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.

- Advertisement -