విశ్రాంత ఉద్యోగులకు కొన్ని సూచనలు..

5
- Advertisement -

వారంతా విశ్రాంత ఉద్యోగులు. కుటుంబ పోషణ కోసమో, వృతి- ఉద్యోగ రిత్యా ఎన్నో ఆటు పోట్లను ఎదుర్కొని జీవితాన్ని సాగించారు. తమ పిల్లల కోసం ఎన్ని కష్టాలు ఎదురైనా మనసులోనే దాచుకుని చిరునవ్వుతో జీవనం సాగించారు. అయితే ఇప్పుడు రిటైర్ అయ్యాక కూడా అలాంటి ఒత్తిడితో కూడిన జీవనం సాగించడ ఇబ్బందికర పరిణామం. ముఖ్యంగా వయసు పెరిగే కొద్ది శారీరకంగా, మానసికంగా ఇబ్బందులు పడుతుంటారు. అలాంటి వారి కోసం సోషల్ మీడియాలో కొన్ని జాగ్రత్తల పేరుతో ఓ న్యూస్ చక్కర్లు కొడుతోంది.

() బాత్రూమ్/టాయిలెట్ కి వెళ్లినప్పుడు లోపల గడియపెట్టుకొనకండి.
() షవరు కింద స్నానం చేసే సమయంలో కూడా స్టూలు వేసుకుని మాత్రమే చేయండి.
() పాశ్చాత్య టాయిలెట్ లో కూర్చుని లేచే సమయంలో హేండిల్ పట్టుకుని లేవండి.
() ప్యాంటు/ఫైజమాలను ధరించేటపుడు కుర్చీ/ మంచంపై గాని కూర్చుని వేసుకొనండి.
() మంచంపై నుండి నిద్రలేచిన వెంటనే నడవడానికి ప్రయత్నించక ఒక్క నిమిషం పాటు కూర్చుని(ముఖ్యంగా రాత్రులందు) తరువాత చిన్నగా నడక సాగించండి.
() తడిగా జారుతున్న నేలలపై నడవకండి.
() స్టూలు/కుర్చిపై నిలబడి మేకులు కొట్టడం, ఫ్యాను తుడవడం, బట్టలు ఆరేయడం లాంటి పనులు చేయకండి.
() ఇతరులెవరూ తోడు లేకుండా స్వయంగా (ఒంటరిగా) వాహనాలు నడిపే ప్రయత్నం చేయకండి.
()డాక్టర్ సూచన మేరకు క్రమం తప్పకుండా మందులు తగిన సమయంలో వేసుకోవడం మరచిపోకండి.
10. మీరు బ్యాంకు, మార్కెట్,షాపింగుకు వెళ్ళేటపుడు మీతో పాటు మీకుటుంబ సభ్యులొకరిని తీసుకెళ్ళడం మరువకండి.
11. మీరు ఇంట్లో ఒంటరిగా వుండవలసిన సమయంలో అపరిచితులనెవ్వరినీ మీదగ్గరకు రానివ్వకండి.
12. మీరుండే నివాస గృహముఖ ద్వారానికి సంబంధించిన తాళపు చెవి ఒకటి మీవద్ద రెండోది మీ కుటుంబ సభ్యుల వద్ద వుంచుకోండి.
13. అత్యవసర సమయంలో పిలవడానికి వీలుగా కాలింగ్ బెల్ స్విచ్ ను మీ పడక మంచానికి అందుబాటులో వుంచుకోండి.

Also Read:రివ్యూ: వీక్షణం

14. ఎవ్వరితోను వాగ్వివాదానికి దిగకుండా అందరితోను మృదువుగాను, సామరస్యంగాను మాట్లాడటం అలవరచుకొనండి.
15. బాధ్యతలు నుండి బంధాల నుండి స్వయంగా మీరే విముక్తులవ్వండి.
16. వయసు మీరుతున్న దశలో మనకు దృష్టి వినికిడి శక్తితో పాటు జ్ఞాపక శక్తి సన్నగిలిపోతుంది కాబట్టి ఆర్ధిక పరమైన లావాదేవీలు తదితర ముఖ్యమైనవన్నీ
భార్య/భర్త కు (అకౌంటు-పిన్ నంబర్లు) తెలియచేయండి. తప్పక అన్నిచోట్లా నామినేషన్ ప్రక్రియ నమోదు చేయండి.
17. ఇతరుల వ్యాపకాలలో జోక్యం చేసుకోకుండా సాధ్యమైనంత దూరంగా వుంటూ మనసుని భగవంతుని వైపు మరలించేలా గ్రంథ పఠనం/శ్రవణం/ధ్యానం అలవాటు
చేసుకోండి.
18. గతాన్ని గురించి గాని భవిష్యత్ గురించి గాని అనవసరంగా అతిగా ఆలోచించి బాధపడకుండా వర్తమానంలో ఆనందంగా వుండటానికి ప్రయత్నించండి.
19. ఆపద సమయంలో అర్హులైన వారికి చేయగలిగిన సహాయం (మాట రూపేణా గాని లేదా ధన రూపేణా కాని) చేయండి.
20. గతంలో ఎలా వున్నా భార్యాభర్తలు ఈ వయసులో ఇరువురు ఒకరిపట్ల ఒకరు ప్రేమ కలిగి అన్యోన్యంగా తోడుగా వుంటూ అందరికీ ప్రేమ పంచుతూ వారి
ఆదరణకు పాత్రులవడానికి పాటుపడండి.
21. ఆదరించే ఆత్మీయులు అందుబాటులో లేనపుడు అశక్తులుగా ఒంటరిగా వుండి ఇబ్బందిపడే బదులు సురక్షితమైన వృద్ధాశ్రమంలో వుండటం మేలు.
22. ఈ వయసులో మానసిక ప్రశాంతతో ఆరోగ్యం కాపాడుకుంటూ అందరితో సత్సంబంధాలు కలిగివుండి జీవనం కొనసాగించడమే లక్ష్యంగా మెలిగితే జీవితం సాఫల్యం అవుతుంది.

పెద్దలు ఆదిశగా ఆలోచించి తగు జాగ్రత్తలు పాటించాలని న్యూస్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

- Advertisement -