రాజభోగాలకు నిలయం… ‘శ్వేతసౌధం’

618
Inside the White House
- Advertisement -

అమెరికా… ప్రపంచ దేశాలకు ఓ స్వప్నం. అగ్రదేశాలు ఎన్ని ఉన్నా ప్రపంచ దేశాల చేత అగ్ర రాజ్యం అని పిలవబడుతోన్న దేశం. అభివృద్ధి అయినా, పతనమైనా దాన్ని అమెరికాతో పోల్చి చూడడం ప్రపంచ దేశాలకు రివాజుగా మారిందంటే అమెరికా గొప్పతనాన్ని సులభంగానే అర్థం చేసుకోవచ్చు. అంతలా ప్రపంచ దేశాలపై అమెరికా తనదైన ముద్ర వేసిందంటే అతిశయోక్తి కాదు.

Inside the White House

ఇంతటి ఖ్యాతి కల్గిన అమెరికాలాంటి దేశానికి అధ్యక్షుడిగా ఎంపిక అవడమంటే… అబ్బ ఎంత గొప్ప అవకాశం అనిపిస్తోంది కదా ? కానీ అమెరికాకు అధ్యక్షుడు అవడమంటే అంత సులభం కాదు మరి. అలాంటి అమెరికాకు ప్రెసిడెంట్ అంటేనే ఆ హోదా, ఆ గౌరవం వేరు. ఒక్క వేతనం, గౌరవం విషయంలోనే కాదు రాజభోగాలను అనుభవించడంలోనూ అమెరికా అధ్యక్షుడికి మించిన వారు ఎవరూ లేరనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.

Inside the White House
ప్రపంచదేశాలకు పెద్దన్నగా పిలవబడుతున్న అగ్రరాజ్య సారథి వార్షిక వేతనం ఏకంగా 4,00,000 డాలర్లను(2కోట్ల 66లక్షల 84వేల180ను) ఇంటికి తీసుకెళ్తారట. వీటితో పాటు 50వేల డాలర్ల(33లక్షల 35వేల 522) వార్షిక వ్యయ ఖర్చులు, అదనంగా ప్రయాణాలకు 1,00,000 డాలర్లు(66లక్షల 71వేల 245), వినోదానికి 19,000 డాలర్లు(రూ.12,67,498)ను ఆయనకు చెల్లిస్తారట.

అధ్యక్షులు పనిలో ఒత్తిడిగా ఫీల్ కాకుండా 18 ఎకరాల గ్రీన్ గ్రౌండ్ లేదా ప్రైవేట్ పూల్ను ఏర్పాటుచేశారు. 55 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న సువిశాలమైన శ్వేతసౌధంలో 132 గదులుంటాయట. ఆ గదులన్నీ ఎల్లప్పుడూ పూల సువాసనలు వెదజల్లిలే తీర్చిదిద్దుతారట. వెంచర్ వ్యయాలు ఏడాదికి 2,50,000 డాలర్ల పైనే ఖర్చు అవుతాయని అంచనా. మొత్తంగా వైట్ హౌస్ వ్యయం ఏడాదికి 4 మిలియన్ డాలర్ల పైనేనట.

Inside the White House

శ్వేత సౌధ అధ్యక్ష కుటుంబం కోసం ఏర్పాటుచేసిన ఏకాంతవాసం క్యాంప్ డేవిడ్ కూడా చాలా చక్కగా ఉంటుంది. చెక్కతో నిర్మించబడిన ఈ ఇళ్లు, స్పా, స్విమింగ్ పూల్, బౌలింగ్ అల్లే, స్కీట్ షూటింగ్ రేంజ్, టెన్నిస్ కోర్టులు, గోల్ఫ్ కోర్సు, గుర్రం స్టేబుల్స్, ఐస్ స్కేటింగ్ రింక్లు కలిగి ఉంటుందట. కుటుంబంతో ఉల్లాసంగా, ఉత్సాహాంగా సేద తీరడానికి ఇది బాగా ఉపయోగపడుతుందట.

Inside the White House

అధ్యక్షుడి కోసం ప్రత్యేకంగా 747-200బీ జెట్స్ను తయారుచేస్తారని, దానిలో సూపర్ లగ్జరియస్ ఆఫీస్, కాన్ఫరెన్స్ రూం, బాత్రూం, జిమ్, బెడ్రూం ఇవన్నీ ఉంటాయట. ఎయిర్ఫోర్స్ అంచనా ప్రకారం ఒక్కసారి గంటసేపు ఈ విమానం గాలిలో ఎగిరితే 2,10,877 డాలర్ల ఖర్చు అవుతుందని తెలుస్తోంది. అయితే తక్కువ దూరాలకు అధ్యక్షుడు ఎప్పుడూ తన ప్రైవేట్ ఛాపర్ మెరైన్ వన్నే వాడతారట. మొదటి ఫ్యామిలీ తినే ప్రైవేట్ మీల్స్, స్టేట్ డిన్నర్స్ అన్నింటికీ గార్డెన్లోని ఫ్రెష్ ఫ్రూట్స్, వెజిటేబుల్స్నే ఉపయోగిస్తారు. ఎగ్జిక్యూటివ్ అండ్ సోస్స్ చెఫ్లు మాత్రమే వీటిని వండుతారట. అదేవిధంగా శ్వేతసౌధం గ్రౌండ్లోని తేనేటీగల నుంచి తీసే తేనెనే వారు ఉపయోగిస్తారు.

Inside the White House

అమెరికా అధ్యక్ష పదవినుంచి దిగిపోయాక కూడా 2,00,000 డాలర్ల వరకు ఏడాది పెన్షన్, ఉచిత ఆరోగ్య సదుపాయాలు, కార్యాలయ ఖర్చులతో ట్రావెల్, జీవితకాల సీక్రెట్ సర్వీసు ప్రొటెక్షన్, ఇంకా తమకు నచ్చిన స్టాఫ్ను నియమించుకునేందుకు 96,000 డాలర్లను వారు పొందుతారట.

అమెరికా అధ్యక్ష భవనం అయిన వైట్‌హౌజ్‌… నిర్మాణానికి ముందు ఓ కోటీశ్వరుడి ఇల్లు. అమెరికా తొలి అధ్యక్షుడు జార్జ్‌ వాషింగ్‌టన్‌… తన అధికార భవనం, కార్యాలయం కోసం ఫిలడేల్ఫియాకు చెందిన కోటీశ్వరుడు విలియం మాస్టర్‌కు చెందిన సువిశాల భవంతిని ఉపయోగించుకున్నాడు. ఫిలడేల్ఫియా దాదాపు పదేళ్లపాటు అమెరికా రాజధానిగా కొనసాగడంతో ఈ భవనం పదేళ్ల పాటు అమెరికాను ఏలిన రాష్టప్రతి భవనంగా చెలామణి అయింది. వైట్‌హౌజ్‌ నిర్మాణం పూర్తయ్యాక ఈ భవనాన్ని మ్యూజియంగా మార్చారు. అమెరికా అధ్యక్షుడి హోదాలో వైట్‌హౌజ్‌లోకి అడుగుపెట్టిన తొలి వ్యక్తి జాన్‌ ఆడమ్స్‌.

Inside the White House

- Advertisement -